BREAKING
ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య

వీకే కోల్ మైన్స్‌లో బదిలీలపై బ్రేక్..

Select Suryaa Now
వీకే కోల్ మైన్స్‌లో బదిలీలపై బ్రేక్..

వీకే కోల్ మైన్స్‌లో బదిలీలపై బ్రేక్..
- ఎవరినీ బదిలీ చేయం- పీఓ శంకర్ హామీ
-డిప్యూటేషన్ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలి -ఐఎన్టీయూసీ డిమాండ్

కొత్తగూడెం సింగరేణి, సూర్య(మేజర్ న్యూస్)- సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని  వీకే కోల్ మైన్స్ ఉద్యోగుల సమస్యలపై ఐఎన్టీయూసీ నాయకులు ప్రాజెక్ట్ ఆఫీసర్ జి. శంకర్‌తో భేటీ అయ్యారు. ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్ సమక్షంలో, పిట్ సెక్రటరీ గోపు కుమారస్వామి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వీకేసీఎంలో పనిచేస్తున్న ఏ ఉద్యోగిని బదిలీ చేయవద్దని, జీకేఓసీ నుంచి వీకేసీఎంగా మారినప్పుడు సత్తుపల్లి తదితర ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉద్యోగులందరినీ తిరిగి తీసుకురావాలని  డిమాండ్ చేశారు.షోవెల్, డంపర్, డోజర్, మోటార్ గ్రేడర్ వంటి భారీ యంత్రాల పనులను సింగరేణి సొంత మ్యాన్‌పవర్‌తోనే చేయించాలని కోరారు. కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి అప్ అండ్ డౌన్ చేస్తూ సీనియర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.దీనిపై పీఓ శంకర్ స్పందిస్తూ వీకేసీఎం నుంచి ఎవరినీ బదిలీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డిప్యూటేషన్ ఉద్యోగులను వెనక్కి తీసుకురావడం, సొంత మ్యాన్‌పవర్‌తో ఉత్పత్తిపై ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో పోషం శ్రీనివాస్, బి. భీముడు, జి. రాజశేఖర్, కాసర్ల సమ్మయ్య, టి. దుర్గా సింగ్, లక్ష్మణ్ రాజు, కలవక శ్రీనివాస్, పిట్ట శ్రీనివాస్, ఎస్. వసంతరావు, పెంటి రామకృష్ణ, జి. ఈశ్వరయ్య, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.