BREAKING
వసతి గృహాల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన మల్యాల మోహన్ గౌడ్ కు ఘన సన్మానం చామనపల్లి, చర్లబుత్కూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం వాగేశ్వరి ఫార్మసీ కళాశాలలో జేఎన్‌టీయూహెచ్ క్రీడా ఎంపికలు విజయవంతం కుషాయిగూడ విస్టా హోమ్స్‌లో ఏరోబిన్ వ్యవస్థ ప్రారంభం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కట్టెంపూడి, ఆలూరులో గ్రామాలలో పొన్నూరు రూరల్ పోలీసుల ఫ్లాగ్ మార్చ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి పార్కింగ్‌ పేరుతో వసూళ్లు.. సౌకర్యాలు ఏవి...? నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు సాగు చేయాలి ఖేతు బచావో అభియాన్' అవగాహనా సదస్సు కేజీబీవీ మైదుకూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కేజీబీవీ మైదుకూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంపై అవగాహన సదస్సు విద్యార్థులే ఉపాధ్యాయులై.. స్వయం పరిపాలన దినోత్సవం సింగర్‌గా మారిన గాడ్ ఆఫ్ మాసెస్.. దడా ధమాకా అంటూ బాలయ్య ఊరమాస్ సాంగ్ విడుదల!

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

Select Suryaa Now
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

పూడూరు, మేజర్ న్యూస్:అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టీ. రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ జేకే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 508 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 19న మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలు, మహిళలు, చేనేత, గీత కార్మికులు తదితర వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.గతంలో పింఛన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్న అక్కాచెల్లెళ్లు, సోదరులకు నూతనంగా పింఛన్లు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని, అర్హులెవరూ పథకాలకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు కడుమూరు ఆనందం, సొసైటీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ తమన్నా అజీమ్ పటేల్, సర్పంచులు వీరేశం, కాటం రామచంద్రయ్య, అంబటి రాజు, గోపాల్, డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు షకీల్, అబ్రహాం, చిన్న నారాయణ, శ్రీకాంత్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.