సుూర్య, సెంటినరీ కాలనీ :ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్‌బీఐ కమాన్‌పూర్ బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వారాహి ఎనర్జీస్ వెండర్ ప్రతినిధులు పాల్గొని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం వివరాలను స్థానిక ప్రజలకు వివరించారు.ఈ పథకం ద్వారా అర్హులైన గృహ వినియోగదారులు తమ ఇళ్లపై సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్టంగా రూ.78,000 వరకు సబ్సిడీ పొందవచ్చని తెలిపారు. సోలార్ విద్యుత్ వినియోగంతో ప్రతి నెలా విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని, దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు.అలాగే సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన బ్యాంకు రుణ సదుపాయాలు, లోన్ ప్రాసెసింగ్ విధానం తదితర అంశాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ కమాన్‌పూర్ బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్లు, వారాహి ఎనర్జీస్ ప్రతినిధులు కొండ వెంకటేష్, నీలం శ్రీనివాస్, మల్లరెడ్డి మహేందర్ రెడ్డి, సిద్ధ వెంకటేష్ మరియు ప్రజాప్రతినిధులు గుర్రం లక్ష్మీమల్లు, అనవేన లక్ష్మీ రాజాం, మాదాసు విజయ్, సామ్రాట్, ఎల్లబోయిన రాంమూర్తి స్థానిక ప్రజలు పాల్గొన్నారు.