BREAKING
పాకిస్థాన్‌ను ఆదుకున్న సౌద్ షకీల్.. శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత పోరాటం! రేపు పాఠశాలలకు సెలవు రద్దు కూటమి తరపున మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా 'పాలూరి' -- అధికారికంగా ప్రకటించిన ఎమ్మెల్యే బొలిశెట్టి పద్మనాభం మండలంలో ఘనంగా కాళ్ల నగేష్ కుమార్ జన్మదిన వేడుకలు వీకే కోల్ మైన్స్‌లో బదిలీలపై బ్రేక్.. ఏపీ పంచాయతీ పోరు షురూ అక్రమ పార్కింగ్ చెక్ యాదగిరి వ్యవహారశైలితో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదంటూ అనిల్‌రెడ్డి వర్గీయుల విమర్శలు పల్లె పోరులోను కూటమిదే విజయం --ఏలూరు అభివృద్ధికి నిధులు రాబట్టడంలోనూ విజయం భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు పీవికే-5 కార్మికులకు అండగా మంత్రి పొంగులేటి నీటి ప్రాజెక్టును పరిశీలించిన కార్పొరేటర్ బుడుమూరి కార్పొరేటర్ ఏడువాక శ్రీ మహాలక్ష్మి సన్యాసిరావుకు సత్కారం కార్పొరేషన్ ఎన్నికలపై వైసిపి కసరత్తు కౌడిపల్లి పీహెచ్‌సీలో టీబీ స్క్రీనింగ్ క్యాంప్

వసతి గృహాల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత

Select Suryaa Now
వసతి గృహాల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: విద్యార్థుల సంక్షేమం, భద్రత, ఆరోగ్యం విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత హెచ్చరించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాలోని పలు సంక్షేమ వసతి గృహాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తగడిలోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల, వసతి గృహాలు, కుల్కచర్ల మండలం ముజాహిపూర్‌లోని మోడల్ స్కూల్, సంక్షేమ హాస్టల్‌తో పాటు సాకేత్‌నగర్, కొత్తగడి, కమలానగర్ ప్రాంతాల్లోని బీసీ సంక్షేమ వసతి గృహాలను సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా వసతి గృహాల పరిసరాలు, విద్యార్థుల నివాస గదులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు, భోజనం నాణ్యత, ఇతర మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి వ్యక్తిగత సమస్యలు, ఇబ్బందులు, వసతి గృహాల్లో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీసి పలు లోపాలను గుర్తించారు.వసతి గృహాల్లో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులకు మెరుగైన వసతి, నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన అంశాలపై సంబంధిత సంక్షేమ అధికారులకు జిల్లా కలెక్టర్ ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని చర్యలు చేపట్టారు.విద్యార్థుల భవిష్యత్తు, విద్యాభివృద్ధి, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని గోగుల సరిత స్పష్టం చేశారు. వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని, బాలల హక్కుల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ తనిఖీల్లో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, ఇన్‌చార్జి డీసీపీఓ శ్రీకాంత్, ఈఓ అంబిక, బాలల పరిరక్షణ అధికారులు, చైల్డ్‌లైన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.