telangana
విద్యార్థులే ఉపాధ్యాయులై.. స్వయం పరిపాలన దినోత్సవం
సుూర్య, సెంటినరీ కాలనీ :బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కమాన్‌పూర్ మండలం జూలపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో పాఠశాలకు హాజరై, ఉపాధ్యాయులుగా మారి వివిధ తరగతుల్లో తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.పాఠ్యాంశాలను వివరించడం, ప్రశ్నలు అడగడం, విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఒకరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు బోధనలోని బాధ్యతలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుతమైన భావన పెంపొందడంతో పాటు ఉపాధ్యాయుల కృషి, అంకితభావం పట్ల గౌరవం పెరిగిందని పాఠశాల ఉపాధ్యాయ బృందం పేర్కొంది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.