వైఎస్ఆర్సీపీకి షాక్ - టీడీపీలోకి 21 కుటుంబాలు చేరిక.
రంగనాథపురంలో బలపడిన తెదేపా.
కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే గౌతు శిరీష.
పలాస/మందస, నవంబర్ 14,మేజర్ న్యూస్.
పలాస నియోజకవర్గం,మందస మండలం,బాలిగాం పంచాయతీ, రంగనాథపురం గ్రామానికి చెందిన 21 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. మందస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలుగా పనిచేసిన పలువురు ఈ చేరికల్లో భాగమయ్యారు.ఈ గ్రామానికి చెందిన కార్యకర్తలు, వారి కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడంతో బాలిగాం పంచాయతీ పరిధిలో పార్టీకి అదనపు బలం చేకూరినట్లయింది. ఈ చేరికలు మండలంలో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, సంక్షేమ పాలనపై నమ్మకంతోనే ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం వైపు వస్తున్నారని తెలిపారు. పలాస నియోజకవర్గంలో గ్రామగ్రామానా పార్టీ బలోపేతం అవుతోందని, రంగనాథపురం గ్రామం నుంచి జరిగిన ఈ చేరికలు అందుకు నిదర్శనమని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం, ప్రాధాన్యం ఉంటుందని, కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.పార్టీలో చేరిన వారిలో పెద్ద రామారావు, చిన్న భైరగి, పందిరి మాధవరావు, పందిరి జ్యువెలరీ, పందిరి పున్నయ్య, పందిరి సింహాద్రి, పందిరి వాసుదేవ్, పందిరి ధర్మారావు, పందిరి తులసీరావు, పందిరి కృష్ణారావు, జుత్తు అప్పలస్వామి, నెయ్యల మురళి, షావుకారి సూర్యనారాయణ, రాజేష్, వెంకన్న, తాతయ్య,గొరకల అప్పలస్వామి, తెప్పల యోగేష్, పందిరి రమేష్, సురేష్, పందిరి రఘునాథ్ ఉన్నారు. వీరంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన తర్వాత వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గౌతు శిరీష నాయకత్వంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మందస మండల టీడీపీ నాయకులు, బాలిగాం పంచాయతీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేరికలతో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. నూతనంగా పార్టీలో చేరిన వారిని నాయకులు, కార్యకర్తలు అభినందిస్తూ స్వాగతం పలికారు.