ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు
కోటబొమ్మాళి, నవంబర్ 14, మేజర్ న్యూస్: మండలంలోని కొత్తపల్లి గ్రామం ఎస్వీఏఎమ్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ (చాచా నెహ్రూ) చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం విద్యార్ధిని విద్యార్ధుల చేతుల మీదుగా కేక్ కట్ చేయించి, వారందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో పాఠశాల కరస్పాండెంట్ నౌపడ రామారావు, డైరెక్టర్ దుబ్బ శివాజీ నాయుడు, సలహాదారు నౌపడ సింహాచలం, ప్రిన్సిపాల్ కర్రి రామగోపాలరావులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు