BREAKING
ఎల్.ఆర్.జి పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బాలోత్సవం, వార్షికోత్సవం పద్మనాభపురం కాలనీలో చైర్మన్ గంగాభవాని పర్యటన. మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరం.. జగన్, ఆయన కుటుంబంపై సైబర్ దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి పాత పింఛను విధానానికి దరఖాస్తుల ఆహ్వానం.... గురుకులాల్లో ఘనంగా బాలల దినోత్సవం.. ‘ బాక్సాఫీస్ వద్ద రామాయణ సునామీ.. పది రోజుల్లోనే ₹670 కోట్ల మార్క్ దాటిన రణ్‌బీర్ కపూర్, యశ్ చిత్రం రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక అనపర్తి సర్పంచ్ బరిలో వీరన్నబాబు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. జెన్‌జీ తరానికి అనన్య పాండే మద్దతు.. ఊరికే అపవాదు మోస్తున్నారంటూ హెచ్‌టీఎల్ఎస్ 2026లో వ్యాఖ్యలు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించాలి అధికారుల సమన్వయం, అంకితభావం అభినందనీయం :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆతిథ్య నిర్వహణలో భేష్.. విక్టరీ లో బాలలు దినోత్సవం.

ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడితే అధికారులపై క్రిమినల్ కేసులు తప్పవు...!.

Select Suryaa Now
ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడితే అధికారులపై క్రిమినల్ కేసులు తప్పవు...!.


- పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.. 
- స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
-  అధికారులకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరిక

శ్రీకాకుళం, నవంబర్ 14మేజర్ న్యూస్ :
ఎన్నికల విధుల్లో భాగంగా రాజ్యాంగానికి, ఎన్నికల చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా కొందరు రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. బాధిత అభ్యర్థులతో కలిసి సంబంధిత అధికారులపై క్రిమినల్ ఫిర్యాదులు చేయాలని పార్టీ నిర్ణయించినట్లు వెల్లడించారు.

శనివారం శ్రీకాకుళంలోని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ కేసులు నమోదు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదులు దాఖలు చేస్తామని పేర్కొన్నారు.

ప్రస్తుతం జరగనున్న మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు కూడా ముందుగానే హెచ్చరిక చేస్తున్నానని, రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది, కౌంటింగ్ సిబ్బంది ఎవరైనా సరే ఎన్నికల ప్రక్రియలో చట్టాన్ని అతిక్రమిస్తే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, సంబంధిత అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తామని వ్యాఖ్యానించారు.

ఈసారి శ్రీకాకుళం నగర మున్సిపల్ ఎన్నికల్లో తానే ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరిస్తానని ధర్మాన ప్రకటించారు. మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి ఎన్నికల ఏజెంట్‌గా కూడా తానే ఉంటానని తెలిపారు. నగరంలోని ప్రతి పోలింగ్ కేంద్రానికి న్యాయవాదులను జనరల్ ఏజెంట్లుగా నియమిస్తామని వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి అందే ఫిర్యాదులను పరిశీలించి, ఎవరైనా అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లు ఆధారాలు లభిస్తే వెంటనే క్రిమినల్ ఫిర్యాదులు చేసే ప్రక్రియ చేపడతామని చెప్పారు.

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులకు ఉన్న ఇబ్బందులేమిటి? అని ప్రశ్నించిన ధర్మాన, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమైన బాధ్యతని, అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా రాజ్యాంగబద్ధంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం లేదా చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.