BREAKING
మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరం.. జగన్, ఆయన కుటుంబంపై సైబర్ దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి పాత పింఛను విధానానికి దరఖాస్తుల ఆహ్వానం.... గురుకులాల్లో ఘనంగా బాలల దినోత్సవం.. ‘ బాక్సాఫీస్ వద్ద రామాయణ సునామీ.. పది రోజుల్లోనే ₹670 కోట్ల మార్క్ దాటిన రణ్‌బీర్ కపూర్, యశ్ చిత్రం రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక అనపర్తి సర్పంచ్ బరిలో వీరన్నబాబు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. జెన్‌జీ తరానికి అనన్య పాండే మద్దతు.. ఊరికే అపవాదు మోస్తున్నారంటూ హెచ్‌టీఎల్ఎస్ 2026లో వ్యాఖ్యలు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించాలి అధికారుల సమన్వయం, అంకితభావం అభినందనీయం :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆతిథ్య నిర్వహణలో భేష్.. విక్టరీ లో బాలలు దినోత్సవం. బాలీవుడ్ నటులపై బెదిరింపులు, భద్రతా ఆందోళనలు భయానకంగా ఉన్నాయన్న అనన్య పాండే నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం..

చెరువులో మునిగి బాలుడి దుర్మరణం.

Select Suryaa Now
చెరువులో మునిగి బాలుడి దుర్మరణం.

 

పాతపట్నం మండలం ప్రహరాజపాలెంలో తీవ్ర విషాదం

పాతపట్నం నవంబర్ 14,మేజర్ న్యూస్:

పాతపట్నం మండలం ప్రహరాజపాలెం గ్రామానికి చెందిన బంటుపల్లి భాస్కరరావు (13) అనే బాలుడు శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. భాస్కరరావు మధ్యాహ్నం సమయంలో కోడూరు గ్రామం వైపు వెళ్లే రహదారి పక్కన ఉన్న చెరువులోకి స్నానానికి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు లోతుకు వెళ్లడంతో నీటిలో మునిగి ఊపిరాడక మరణించాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు బాలుడిని వెలికితీసి హుటాహుటిన పాతపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రానికి (CHC) తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పాతపట్నం పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, ప్రహరాజపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.