BREAKING
బాలల ఉజ్వల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు చెరువులో మునిగి బాలుడి దుర్మరణం. అంబేద్కర్ గురుకులంలో ఘనంగా బాలల దినోత్సవం.. కాఫీ విత్ కరణ్ షోలో అనన్య పాండేకు సరదా చిక్కు.. ఆదిత్య రాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్ కాల్స్‌పై ఆసక్తికర రచ్చ వైఎస్ఆర్‌సీపీకి షాక్ - టీడీపీలోకి 21 కుటుంబాలు చేరిక. కడియపులంకలో కోటి దీపోత్సవానికి భారీ ఏర్పాట్లు ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడితే అధికారులపై క్రిమినల్ కేసులు తప్పవు...!. జాతీయ స్థాయి పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థినుల ప్రతిభ.. నామినేషన్ కేంద్రాలను సందర్శించిన కాశీబుగ్గ ఎస్‌హెచ్‌ఓ. బాలల దినోత్సవ వేడుకల్లో నెహ్రూకు ఘన నివాళి మై వాపస్ ఆఊంగా చిత్రంపై ఇంతియాజ్ అలీ ప్రత్యేక దృష్టి.. సినీ ప్రియుల్లో పెరుగుతున్న ఆసక్తి పంచాయతీ ఎన్నికల నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై జి. నరేష్ కడియపులంక సర్పంచ్ బరిలో కీలక పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న రాంజీ తల్లిదండ్రులు షర్మిలా ఠాగూర్, టైగర్ పటౌడీ బాల్య ఫొటోలను పంచుకున్న సోహా అలీ ఖాన్.. నెహ్రూతో అరుదైన చిత్రాలు

తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి
సూర్య, తంగళ్ళపల్లి: తెలంగాణ గ్రామీణ బ్యాంకు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తంగళ్లపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వరుణ్ కుమార్ అన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం బ్యాంకు సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయ రుణాలు, ఎల్.టి రుణాలు, పాడి గేదెల కొనుగోలు కోసం రుణాలు అందిస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు తక్కువ వడ్డీపై 25 లక్షల వరకు రుణాలు, అలాగే ట్రాక్టర్, హార్వెస్టర్, జేసీబీ వంటి వాటిపై రుణాలు ఇస్తున్నామన్నారు. రైతునేస్తం, వివిధ రకాల ప్రధాన మంత్రి ఇన్సూరెన్స్ పథకాల గురించి అవగాహన కల్పించారు.రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఫిక్స్డ్ డిపాజిట్ల మీద కూడా అత్యధిక వడ్డీ రేట్లు తమ బ్యాంకు ఇస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది తిరుపల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు బొడ్డు పర్ష రాములు, సీఎస్పీలు, ఐకేపీ సిబ్బంది, వినియోగదారులు, రైతులు పాల్గొన్నారు.