BREAKING
పద్మనాభపురం కాలనీలో చైర్మన్ గంగాభవాని పర్యటన. మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరం.. జగన్, ఆయన కుటుంబంపై సైబర్ దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి పాత పింఛను విధానానికి దరఖాస్తుల ఆహ్వానం.... గురుకులాల్లో ఘనంగా బాలల దినోత్సవం.. ‘ బాక్సాఫీస్ వద్ద రామాయణ సునామీ.. పది రోజుల్లోనే ₹670 కోట్ల మార్క్ దాటిన రణ్‌బీర్ కపూర్, యశ్ చిత్రం రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక అనపర్తి సర్పంచ్ బరిలో వీరన్నబాబు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. జెన్‌జీ తరానికి అనన్య పాండే మద్దతు.. ఊరికే అపవాదు మోస్తున్నారంటూ హెచ్‌టీఎల్ఎస్ 2026లో వ్యాఖ్యలు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించాలి అధికారుల సమన్వయం, అంకితభావం అభినందనీయం :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆతిథ్య నిర్వహణలో భేష్.. విక్టరీ లో బాలలు దినోత్సవం. బాలీవుడ్ నటులపై బెదిరింపులు, భద్రతా ఆందోళనలు భయానకంగా ఉన్నాయన్న అనన్య పాండే

బాలల ఉజ్వల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది

Select Suryaa Now
బాలల ఉజ్వల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది

 

బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, నవంబర్ 14, మేజర్ న్యూస్:  
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని చిన్నారులందరికీ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలలే భావి భారత పౌరులని, వారి అభ్యున్నతిపైనే రాష్ట్ర, దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని పేర్కొన్నారు.

ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే బాలలు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆకాంక్షించారు.

చిన్నారుల ఆశయాలకు తగిన అవకాశాలు కల్పిస్తూ, వారి కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు. బాలల సమగ్ర వికాసానికి, ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన నాణ్యమైన విద్య, మెరుగైన వాతావరణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలని, వారి ప్రతిభాపాటవాలు దేశ ప్రగతికి దోహదపడాలని ఆకాంక్షిస్తూ మరోసారి బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.