BREAKING
ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు చెరువులో మునిగి బాలుడి దుర్మరణం. అంబేద్కర్ గురుకులంలో ఘనంగా బాలల దినోత్సవం.. కాఫీ విత్ కరణ్ షోలో అనన్య పాండేకు సరదా చిక్కు.. ఆదిత్య రాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్ కాల్స్‌పై ఆసక్తికర రచ్చ వైఎస్ఆర్‌సీపీకి షాక్ - టీడీపీలోకి 21 కుటుంబాలు చేరిక. కడియపులంకలో కోటి దీపోత్సవానికి భారీ ఏర్పాట్లు ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడితే అధికారులపై క్రిమినల్ కేసులు తప్పవు...!. జాతీయ స్థాయి పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థినుల ప్రతిభ.. నామినేషన్ కేంద్రాలను సందర్శించిన కాశీబుగ్గ ఎస్‌హెచ్‌ఓ. బాలల దినోత్సవ వేడుకల్లో నెహ్రూకు ఘన నివాళి మై వాపస్ ఆఊంగా చిత్రంపై ఇంతియాజ్ అలీ ప్రత్యేక దృష్టి.. సినీ ప్రియుల్లో పెరుగుతున్న ఆసక్తి పంచాయతీ ఎన్నికల నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై జి. నరేష్ కడియపులంక సర్పంచ్ బరిలో కీలక పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న రాంజీ తల్లిదండ్రులు షర్మిలా ఠాగూర్, టైగర్ పటౌడీ బాల్య ఫొటోలను పంచుకున్న సోహా అలీ ఖాన్.. నెహ్రూతో అరుదైన చిత్రాలు కడియంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

పార్కింగ్‌ పేరుతో వసూళ్లు.. సౌకర్యాలు ఏవి...?

Select Suryaa Now
పార్కింగ్‌ పేరుతో వసూళ్లు.. సౌకర్యాలు ఏవి...?
సూర్య, శంకరపట్నం:ఆర్టీసీ బస్టాండ్‌లో వాహనాలు పార్కింగ్‌ చేస్తే ఎంత రుసుము చెల్లించాలి...? పార్కింగ్‌ నిర్వాహకులు వాహనదారులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి...? నిర్ణయించిన రుసుముల వివరాలు ఎక్కడ ప్రదర్శించాలి....? అనే ప్రశ్నలు శంకరపట్నం మండలం కేశవపట్నం బస్టాండ్‌లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, దానికి సంబంధించిన రుసుములు, సౌకర్యాలు, నిర్వహణ నిబంధనలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు తమ ద్విచక్ర వాహనాలను పార్కింగ్‌ స్థలంలో నిలిపినప్పుడు గంటవారీగా, రోజువారీగా ఎంత రుసుము చెల్లించాలనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ద్విచక్ర వాహనాలు, కార్లకు వేర్వేరు చార్జీలు ఉన్నాయా...? రాత్రివేళ వాహనాలు నిలిపితే అదనపు రుసుము ఉంటుందా...? అనే వివరాలను బోర్డుపై ప్రదర్శించాలి. పార్కింగ్‌ రుసుము వసూలు చేసిన ప్రతిసారి వాహనదారులకు రసీదు అందించాలి. పార్కింగ్‌ స్థలంలో వాహనాల భద్రతకు సీసీ కెమెరాలు, రాత్రివేళ విద్యుత్‌ దీపాలు, ఎండ, వానల నుంచి రక్షణ కల్పించే షెడ్డు వంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది.
 
-- కాంట్రాక్టు నిబంధనలు బహిర్గతం చేయాలి...
 
పార్కింగ్‌ నిర్వహణకు సంబంధించి ఆర్టీసీ అధికారులు కేటాయించిన కాంట్రాక్టు వివరాలు, ఒప్పంద కాలపరిమితి, కాంట్రాక్టుదారుడి బాధ్యతలు, వాహనాల పార్కింగ్‌కు నిర్ణయించిన రుసుముల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. నిర్ణీత రుసుముల కంటే అధికంగా వసూలు చేస్తున్నారా...? పార్కింగ్‌ నిర్వహణలో నిబంధనలు పాటిస్తున్నారా....? అనే అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది.
 
-- అధికారుల పర్యవేక్షణ ఏదీ...?
 
కేశవపట్నం బస్టాండ్‌ పార్కింగ్‌ నిర్వహణపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. పార్కింగ్‌ రుసుములపై స్పష్టత ఇవ్వడంతో పాటు, ప్రజలకు కనిపించేలా రేట్ల పట్టికను ఏర్పాటు చేయాలి. వాహనదారులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారో లేదో తనిఖీ చేయాలి. కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకోవాలి. పార్కింగ్‌ పేరుతో వాహనదారులపై అనవసర ఆర్థిక భారం పడకుండా, వారు చెల్లించే రుసుముకు తగిన సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.