బాలలు ఆనందంగా బాల్యాన్ని గడపాలి
చేర్యాల …చేర్యాల : బాలలు అందమైన, ఆనందమైన బాల్యాన్ని గడుపుతూ చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించాలని కడవేర్గు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. రాజమణి సూచించారు. పాఠశాలలో ముందస్తుగా నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు.విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపన్యాసాలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. తొలుత విద్యార్థులు చిత్రించిన జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేశ్, కృష్ణమూర్తి, లింగాచారి, రామకృష్ణ, కాంతికృష్ణ, మమత, అరుణ తదితరులు పాల్గొన్నారు.