BREAKING
పాకిస్థాన్‌ను ఆదుకున్న సౌద్ షకీల్.. శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత పోరాటం! రేపు పాఠశాలలకు సెలవు రద్దు కూటమి తరపున మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా 'పాలూరి' -- అధికారికంగా ప్రకటించిన ఎమ్మెల్యే బొలిశెట్టి పద్మనాభం మండలంలో ఘనంగా కాళ్ల నగేష్ కుమార్ జన్మదిన వేడుకలు వీకే కోల్ మైన్స్‌లో బదిలీలపై బ్రేక్.. ఏపీ పంచాయతీ పోరు షురూ అక్రమ పార్కింగ్ చెక్ యాదగిరి వ్యవహారశైలితో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదంటూ అనిల్‌రెడ్డి వర్గీయుల విమర్శలు పల్లె పోరులోను కూటమిదే విజయం --ఏలూరు అభివృద్ధికి నిధులు రాబట్టడంలోనూ విజయం భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు పీవికే-5 కార్మికులకు అండగా మంత్రి పొంగులేటి నీటి ప్రాజెక్టును పరిశీలించిన కార్పొరేటర్ బుడుమూరి కార్పొరేటర్ ఏడువాక శ్రీ మహాలక్ష్మి సన్యాసిరావుకు సత్కారం కార్పొరేషన్ ఎన్నికలపై వైసిపి కసరత్తు కౌడిపల్లి పీహెచ్‌సీలో టీబీ స్క్రీనింగ్ క్యాంప్

నిమ్స్‌లో రూ.100 కోట్ల స్కామ్‌పై ఎంక్వైరీ చేయాలని డిమాండ్.. కొండపోచమ్మసాగర్, కాళేశ్వరం పనులపై నిలదీత

Select Suryaa Now
నిమ్స్‌లో రూ.100 కోట్ల స్కామ్‌పై ఎంక్వైరీ చేయాలని డిమాండ్.. కొండపోచమ్మసాగర్, కాళేశ్వరం పనులపై నిలదీత

సిద్దిపేట అర్బన్/ గజ్వేల్ : సిద్దిపేట రాజకీయ వేదికగా మరోసారి సాగునీటి ప్రాజెక్టుల అవినీతి ఆరోపణలు తెరపైకి వచ్చాయి. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. మల్లన్నసాగర్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు, కెమికల్ ట్రీట్‌మెంట్, భవిష్యత్తులో తలెత్తే ప్రమాదాలపై వచ్చిన నివేదికలను పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. ప్రస్తుతం మల్లన్నసాగర్‌లో లీకేజీ సమస్య తలెత్తడానికి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు అవినీతి చర్యలే కారణమని ఆమె ఆరోపించారు.నిమ్స్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.100 కోట్ల వ్యవహారంపై విచారణ జరిపించే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. కొండపోచమ్మసాగర్ నిర్మాణంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతిపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని నిలదీశారు.టన్నెల్‌ను కాలువగా మార్చి అంచనా వ్యయాన్ని రూ.1,700 కోట్ల మేర పెంచిన వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నివేదికలు సూచించినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హరీశ్‌రావుపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా, సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తాలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు భూమిపూజ నిర్వహించారు. అంతకుముందు శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు.సిద్దిపేటలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా కవిత చేసిన ఈ వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రాజెక్టుల నిర్మాణం, నిధుల వ్యయం, నాణ్యత, అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం స్పందిస్తుందా? ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తుందా? అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.