BREAKING
పాకిస్థాన్‌ను ఆదుకున్న సౌద్ షకీల్.. శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత పోరాటం! రేపు పాఠశాలలకు సెలవు రద్దు కూటమి తరపున మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా 'పాలూరి' -- అధికారికంగా ప్రకటించిన ఎమ్మెల్యే బొలిశెట్టి పద్మనాభం మండలంలో ఘనంగా కాళ్ల నగేష్ కుమార్ జన్మదిన వేడుకలు వీకే కోల్ మైన్స్‌లో బదిలీలపై బ్రేక్.. ఏపీ పంచాయతీ పోరు షురూ అక్రమ పార్కింగ్ చెక్ యాదగిరి వ్యవహారశైలితో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదంటూ అనిల్‌రెడ్డి వర్గీయుల విమర్శలు పల్లె పోరులోను కూటమిదే విజయం --ఏలూరు అభివృద్ధికి నిధులు రాబట్టడంలోనూ విజయం భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు పీవికే-5 కార్మికులకు అండగా మంత్రి పొంగులేటి నీటి ప్రాజెక్టును పరిశీలించిన కార్పొరేటర్ బుడుమూరి కార్పొరేటర్ ఏడువాక శ్రీ మహాలక్ష్మి సన్యాసిరావుకు సత్కారం కార్పొరేషన్ ఎన్నికలపై వైసిపి కసరత్తు కౌడిపల్లి పీహెచ్‌సీలో టీబీ స్క్రీనింగ్ క్యాంప్

జిల్లా వికలాంగుల కమిటీలో చేర్యాల వాసికి స్థానం* సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి అనిల్‌కు ఘన సన్మానం

Select Suryaa Now
జిల్లా వికలాంగుల కమిటీలో చేర్యాల వాసికి స్థానం* సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి అనిల్‌కు ఘన సన్మానం

చేర్యాల : .చేర్యాల : సిద్దిపేట జిల్లా వికలాంగుల కమిటీలో చేర్యాల పట్టణానికి చెందిన వెన్నుపూస బాధిత వికలాంగుడు, ఎన్‌పీఆర్‌డీ చేర్యాల డివిజన్ అధ్యక్షుడు తుమ్మలపల్లి అనిల్ సభ్యుడిగా నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ హైమావతి, డీడబ్ల్యూఓ శారద ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలో ఆయనకు స్థానం కల్పించారు.ఈ సందర్భంగా సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, కొంగరి వెంకట్ మావో, టౌన్ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు తదితరులు అనిల్‌ను ఘనంగా సన్మానించారు.అనిల్ మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాల్లో వికలాంగుల హక్కులు, సంక్షేమం కోసం నిస్వార్థంగా సేవలందిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి వికలాంగుడికి అందేలా కృషి చేయడమే తన లక్ష్యమన్నారు. జిల్లా కమిటీలో సభ్యుడిగా అవకాశం కల్పించిన కలెక్టర్ హైమావతి, డీడబ్ల్యూఓ శారదకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై కూడా నాలుగు మండలాల వికలాంగులకు అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో కొంగరి వెంకట్ మావో, తుప్పతి రాజు, ఆముదాల రంజిత్ రెడ్డి, శోభారాణి, మైసయ్య, బోయిని మల్లేశం తదితరులు పాల్గొన్నారు.