యాచారం ముదిరాజ్ సంఘం గ్రామ కమిటీ ఎన్నిక
బంట్వారం, మేజర్ న్యూస్: యాచారం గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా జన్ముల అనంతరాములు, ఉపాధ్యక్షులుగా ఉప్పరి నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా చట్నీ రాములు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని బంట్వారం మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మోహన్ కుమార్ ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికైన సభ్యులు సంఘం అభివృద్ధికి, ముదిరాజుల ఐక్యతకు కృషి చేయాలన్నారు .మండలంలోని ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు నరేష్ ముదిరాజ్, శ్రీశైలం, వెంకటేశం, అశోక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు