రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం* పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి
చేర్యాల ....చేర్యాల: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి అన్నారు. చేర్యాల పట్టణంలోని వాసవి కాటన్ ఇండస్ట్రీస్‌లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర లభించేలా కొనుగోలు కేంద్రం ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోయిని శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ మెరుగు కృష్ణ, డీసీసీ ఉపాధ్యక్షుడు పూర్మ ఆగం రెడ్డి, చేర్యాల మండల అధ్యక్షుడు మంజె మల్లేశం, పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, కొమురవెల్లి మండల అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్, మద్దూరు మండల అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్ రెడ్డి, దేవస్థానాల చైర్మన్లు, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.