BREAKING
నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది విద్యార్థుల దుర్మరణం

Select Suryaa Now
అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది విద్యార్థుల దుర్మరణం

గువాహటి: అసోంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కజిరంగా ప్రాంతంలో విద్యార్థులతో వెళ్తున్న ఓ కాలేజీ వ్యాన్‌ను ఎదురుగా వస్తున్న ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ దుర్ఘటనలో మరో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అతివేగమా లేక నిర్లక్ష్యమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి 10 మంది విద్యార్థులు మృతి చెందడంతో స్థానికంగా మరియు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.