BREAKING
నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి

వైభవంగా మణవాళ మహామునుల వర్ష తిరు నక్షత్ర మహోత్సవం

Select Suryaa Now
వైభవంగా మణవాళ మహామునుల వర్ష తిరు నక్షత్ర మహోత్సవం

నెల్లూరు నగరంలోని రంగనాయకుల పేటలో వెలసిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో శుక్రవారం శ్రీ మణవాళ మహామునుల వర్ష తిరు నక్షత్ర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం  శ్రీ మణవాళ మహామునులకు బంగారు పల్లకిలో పేట ఉత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథస్వామికి, శ్రీ మణవాళ మహామునులకు వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా తిరుమంజనం జరిపారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథస్వామి, శ్రీ మణవాళ మహామునుల పేట ఉత్సవం వేడుకగా సాగింది. ఈ కార్యక్రమానికి ముప్పిరాల నరసింహాచార్యులు నిర్దిష్ట ధర్మాదాయం నుంచి దేవస్థానం ఉభయకర్తలుగా వ్యవహరించింది.

ఉత్సవంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, దేవస్థాన చైర్మన్ లెక్కల వెంకట రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు  ఎక్స్-అఫీషియో సభ్యుడు దొరస్వామితో పాటు దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.