BREAKING
నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి

అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణ ఎస్సీ కౌన్సిలర్లకు సన్మానం

Select Suryaa Now
అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణ ఎస్సీ కౌన్సిలర్లకు సన్మానం

అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణ ఎస్సీ కౌన్సిలర్లకు సన్మానం

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :- పట్టణంలోని డాంగే నగర్ లో గల లయన్స్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన ఎస్సీ కౌన్సిలర్ లు 10వ వార్డ్ కౌన్సిలర్ తుమ్మల ప్రభాకర్, 22వ వార్డు కౌన్సిలర్ చెరుకుమల్లి రాంబాబు, 30వ వార్డు కౌన్సిలర్ ముత్యాల మరియమ్మ, 31వ వార్డు కౌన్సిలర్ కనికర్ల మేఘన, 35వ వార్డ్ కౌన్సిలర్ కె సాయి భరద్వాజ్ లను పూల బోకే, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రముఖ న్యాయవాది దామాల సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచి పదవులు పొందడం అంటే అది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ఫలితమే అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు ఆయా వార్డులలో మౌలిక వసతులు కల్పనతోపాటు సేవా భావంతో ఉండాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బోధించి, సమీకరించి, పోరాడు వంటి బోధనలు చేశారని, ఆయన స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ప్రజలు మీకు కల్పించారని అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజాసేవ పరమావధిగా సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సేవాసమితి ప్రతినిధులు జి శ్రీకాంత్, నాగేశ్వరరావు, ఎం కొండయ్య, ఫణితి ఆనంద్, పారా వెంకటరత్నం, న్యాయవాది దాసరి నాగేశ్వరరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కరుణాకర్, చుక్క సంజీవరావు, ప్రసాద్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా