BREAKING
అండూరులో ఉచిత పశువైద్య శిబిరం యాచారం ముదిరాజ్ సంఘం గ్రామ కమిటీ ఎన్నిక రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం* పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి *పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లపైనే భారీ వాహనాల పార్కింగ్* అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది విద్యార్థుల దుర్మరణం అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణ ఎస్సీ కౌన్సిలర్లకు సన్మానం బాలలు ఆనందంగా బాల్యాన్ని గడపాలి దాతృత్వ స్ఫూర్తిని చాటిన గీతం బీ-స్కూల్ విద్యార్థులు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పల్లె పోరు అయినా ప్రజాస్వామ్యబద్ధంగా జరపండి జిల్లా వికలాంగుల కమిటీలో చేర్యాల వాసికి స్థానం* సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి అనిల్‌కు ఘన సన్మానం శ్రీ కపిలేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రెస్ మీట్‌లో బోరున విలపించిన 'బ్లాక్ గోల్డ్' చిత్ర నిర్మాత మూర్తి.. అసలు కారణం ఏమిటంటే? ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం.. ‘ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.. * కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి..

సుబ్రహ్మణ్యం కు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డు

Select Suryaa Now
సుబ్రహ్మణ్యం కు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డు

వింజమూరు,  మేజర్ న్యూస్ :  వింజమూరు కు చెందిన ఉపాధ్యాయుడు తాళ్లపాలెం సుబ్రహ్మణ్యంకు టీచర్స్ హబ్ ఇండియా వారు విద్యారంగంలోఇన్నోవేషన్ విధానాలు, వినూత్న సేవలు, విద్యార్థులలో నైపుణ్యాలు పెంపొందించే విధంగా కృషిచేసిన  వారికి ఇచ్చే గ్లోబల్ ఎడ్యుకేషన్ ఐకానిక్ అవార్డు 2026ను ఎంపిక చేసి అవార్డును అందించారు. విద్యార్థులకు జాతీయ స్కాలర్షిప్లు సాధించేందుకు శిక్షణనివ్వటం, సీబీఎస్ఈ పాఠశాలల్లో ఉచితంగా విద్యను పొందేందుకు శ్రేష్ట లాంటి పరీక్షలలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం ఉచిత సీట్లు సాధించటం, పాలీసెట్, త్రిబుల్ ఐటీ లో విద్యార్థులకు ఉచిత విద్య , వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు ఉచితంగా గైడెన్స్ ఇవ్వడం, దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధిని కృషి చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డుకు సుబ్రహ్మణ్యం ను ఎంపిక చేసినట్టు టీచర్ హబ్స్ ఇండియా ప్రెసిడెంట్ అనిల్ రామనాథం తెలిపారు. సుబ్రహ్మణ్యం కు జిల్లా, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు జాతీయ ఇన్నోవేషన్ శిక్షా రత్న అవార్డును అందుకొని ఉన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ఆహ్వానంపై జిఎస్టి 2.0 సభకు హాజరైనారు. ఈ అవార్డు అందుకోవటం వల్ల విద్యారంగం పట్ల తన బాధ్యత మరింత పెరిగిందని, విద్యార్థులకు సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తానని సుబ్రహ్మణ్యం తెలిపారు ఆయన ప్రస్తుతం సంగం హైస్కూల్లో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆయనని పలువురు అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు