వై.సి.పి నుండి టి.డి.పి లో చేరిన కుటుంబాలు
చిల్లకూరు, మేజర్ న్యూస్ : చిల్లకూరు శంకర గిరిజన కాలానీలోని వైయస్సార్సీపీకి చెందిన సుమారు 50 కుటుంబాల ప్రజలు శుక్రవారం తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామిరెడ్డి, చిల్లకూరు పి.ఎ.సి.ఎస్ అధ్యక్షులు కొండా రామచంద్రారెడ్డి, బీసీ నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో పెంచలకోన ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ తానంకి నానాజీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి నచ్చి ఇతర పార్టీల్లో ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా కూటమిలో చేరుతున్నారన్నారు.చిల్లకూరు మండల అభివృద్ధి కోసం కృషి చేస్తామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామ్మూర్తి, నాయకులు బెల్లంకొండ శివ, యనమల దినేష్, వెంపులూరు శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.