*గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే*
నారాయణఖేడ్;నారాయణఖేడ్ పట్టణం నుండి ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన గనుగాపూర్‌కు నిర్వహించే మహా పాదయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు పాదయాత్రను ప్రారంభించగా నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి పాదయాత్రలో నడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి పాదయాత్ర చేపట్టడం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిభావాన్ని, ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పాదయాత్రలో పాల్గొంటున్న భక్తులందరికీ శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ క్షేమంగా గనుగాపూర్ చేరుకొని స్వామివారిని దర్శించుకొని తిరిగి సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.