BREAKING
కాశీబుగ్గలో అగ్నిప్రమాదం - గడ్డికుప్ప బూడిద. వస్తువులు అడిగి పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగుడు పంచాయతీ ఎన్నికల బరిలో దొమ్మేటి వినోద్ కుమార్ అధిక సాంద్రత పద్ధతితో అధిక దిగుబడి. • కోటపల్లి ఏమ్ఏఓ సాయి కృష్ణ. బొడ్డపాడు రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత. దివ్యాంగలకు శాప్ స్పోర్ట్స్ పాలసీలో గుర్తింపు ఇవ్వాలి హైదరాబాద్‌క రాహుల్ గాంధీ పర్యటన.. రేప గిగ్ వర్కర్లతో భారీ ర్యాలీ, సంక్షేమ పథకాల ప్రారంభం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కృషి ఫలితం.. రెండు చెరువుల పునరుద్ధరణకు రూ.3.32 కోట్ల నిధులు మంజూరు అనపర్తి మండలంలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు. ప్రజలకు మెరుగైన డిజిటల్ వైద్య సేవలే లక్ష్యం.. వికారాబాద్‌లో బీసీసీఐ అండర్‌-19 మహిళా క్రికెటర్‌ నందిని ఆత్మహత్య.. ప్రేమ వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణలు ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ ప్రారంభం -విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు -నాయకత్వ లక్షణాలతో పాటు మానసిక వికాసానికి దోహదం : శాప్ చైర్మన్ రవి నాయుడు రావులపాలెం మండలంలో వైఎస్సార్‌సీపీ పరిస్థితి అయోమయం! సంపాదించుకున్న నాయకులు సైడ్‌.. కార్యకర్తల్లో సందిగ్ధం! కౌడిపల్లి పీహెచ్‌సీలో టీబీ స్క్రీనింగ్ క్యాంప్ పెద్దకల్వల కాంగ్రెస్ గ్రామ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక... - అధ్యక్షుడిగా సలేంద్ర రవి

నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు

Select Suryaa Now
నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఅనపర్తి మండల పరిధిలోని 11 గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏడు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా సహాయ ఎన్నికల అధికారి, మండల అభివృద్ధి అధికారి ఎం. రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడించారు.మండలంలోని 11 గ్రామపంచాయతీల్లో 11 సర్పంచ్ పదవులతో పాటు 140 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా మొత్తం 60,010 మంది ఓటర్ల కోసం 160 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నామినేషన్ల స్వీకరణ బాధ్యతలను స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. అనపర్తికి పప్పు శ్రీనివాసరెడ్డి, కుతుకులూరుకు టి.ఎస్. రమాదేవి, మహేంద్రవాడకు పి.వి. ప్రభాకరరావు, రామవరం, పొలమూరుకు సి.హెచ్.వి.వి. కన్నారావు, పెడపర్తి, పులుగుర్తకు సి.హెచ్. శ్రీనివాసరెడ్డి, లక్ష్మీనరసాపురం, కొప్పవరానికి టి.టి.వి. సత్యనారాయణరెడ్డి, పి.ఆర్.సి. పురం, దుప్పలపూడికి ఎస్. ముక్యాలరావు నామినేషన్ల స్వీకరణ బాధ్యతలు నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమయం కేటాయించినట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ అధికారులకు సహకరించాలని సూచించారు. మండలంలో ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎం. రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.