BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కృషి ఫలితం.. రెండు చెరువుల పునరుద్ధరణకు రూ.3.32 కోట్ల నిధులు మంజూరు

Select Suryaa Now
ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కృషి ఫలితం.. రెండు చెరువుల పునరుద్ధరణకు రూ.3.32 కోట్ల నిధులు మంజూరు

మెదక్: మెదక్ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న సాగునీటి వనరుల పునరుద్ధరణకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. 2025 ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న హవేలిఘనపూర్ మండలంలోని పెద్ద చెరువు, మెదక్ మండలం రాయన్‌పల్లి చెరువు మరమ్మతుల కోసం మొత్తం రూ.332.90 లక్షలు (రూ.3 కోట్ల 32 లక్షల 90 వేల రూపాయలు) మంజూరయ్యాయి. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక చొరవ, కృషి ఫలితంగా ఈ నిధులు మంజూరైనట్లు సమాచారం.

హవేలిఘనపూర్ పెద్ద చెరువుకు రూ.108.10 లక్షలు:

2025 ఆగస్టులో కురిసిన భారీ వర్షాల కారణంగా హవేలిఘనపూర్ మండలంలోని పెద్ద చెరువు కట్ట తెగిపోయి తీవ్రంగా దెబ్బతింది. దీంతో చెరువు కట్ట మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కోసం రూ.108.10 లక్షలు (ఒక కోటి 8 లక్షల 10 వేల రూపాయలు) మంజూరయ్యాయి. ఈ నిధులతో దెబ్బతిన్న చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించనున్నారు.

రాయన్‌పల్లి చెరువుకు రూ.224.80 లక్షలు:

అదేవిధంగా మెదక్ మండలం రాయన్‌పల్లి చెరువు కూడా భారీ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. వరద నీటి ఉధృతికి చెరువులోని లో లెవల్ ధోని కొట్టుకుపోవడంతో పాటు హై లెవల్ కాలువ కట్ట తెగిపోయింది. ఈ మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం రూ.224.80 లక్షలు (రెండు కోట్ల 24 లక్షల 80 వేల రూపాయలు) మంజూరు చేసింది. ఈ నిధులతో దెబ్బతిన్న లో లెవల్ ధోని, హై లెవల్ కాలువ కట్ట పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.

రైతులకు సాగునీటి భద్రత.. గ్రామీణ ప్రాంతాలకు ప్రయోజనం:

భారీ వర్షాలు, వరదల కారణంగా చెరువుల కట్టలు తెగిపోవడం, కాలువలు, నీటిపారుదల వ్యవస్థలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలు నీటమునగడం, వ్యవసాయ భూముల్లో ఇసుక, మట్టి పేరుకుపోవడం, పంటలు దెబ్బతినడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అలాగే గ్రామీణ రహదారులు, వంతెనలు, డ్రైనేజీ వ్యవస్థలు, విద్యుత్ సదుపాయాలు, నివాస గృహాలు సైతం భారీ వర్షాల ప్రభావానికి గురవుతున్నాయి.ఈ నేపథ్యంలో చెరువుల కట్టలు, కాలువలు, నీటి నిర్వహణ వ్యవస్థల పునరుద్ధరణ ఎంతో కీలకంగా మారింది. హవేలిఘనపూర్, రాయన్‌పల్లి చెరువులకు నిధులు మంజూరు కావడంతో ఆయా ప్రాంతాల్లో సాగునీటి వనరుల బలోపేతానికి మార్గం సుగమమైంది. మరమ్మతు పనులు పూర్తయితే చెరువుల నీటి నిల్వ సామర్థ్యం, నీటి నిర్వహణ మెరుగుపడటంతో పాటు భూగర్భ జలాల పెంపునకు, వ్యవసాయ రంగ అభివృద్ధికి దోహదపడనుంది.మెదక్ నియోజకవర్గంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న సాగునీటి వనరుల పునరుద్ధరణపై ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక దృష్టి సారించి రెండు చెరువుల మరమ్మతులకు రూ.3.32 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించడంపై రైతులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.