BREAKING
అంబాజీపేట మండలంలో వైభవంగా నాగుల చవితి: పుట్టల్లో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఇండియాస్ గాట్ లేటెంట్ వేదికపై టాక్సిక్ సినిమా వసూళ్లపై సమయ్ రైనా సెటైర్లు.. నటి హుమా ఖురేషి అదిరిపోయే కౌంటర్! జూలపల్లి మండలానికి 406 నూతన పింఛన్లు మంజూరు పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు కర్ర సత్య ప్రసన్నారెడ్డి"ని అభినందించిన "అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి".. మైసూరూలో దేశపు మొదటి ఎల్ఈడీ డోమ్ ప్లానెటోరియంను ప్రారంభించిన ప్రధాని మోదీ వెటర్నరీ ఫిజియాలజీలో క్విజ్ పోటీలు దుమ్ముతో ఇబ్బందులు తొలగించాలని కార్యదర్శికి వినతి. కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా 'జాతీయ గౌరవ దినోత్సవం' సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు ఆశ వర్కర్ల వినతి. బహ్రెయిన్‌లోని యూఎస్ రాడార్ వ్యవస్థపై దాడి చేశామన్న ఇరాన్ స్వచ్ఛంద ఏకగ్రీవాలతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి అటజని కంచె ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న బాల 369 టీజర్ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు పాముల పుట్టల వద్ద పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు అధ్యాపకుల కొరతను తక్షణమే పరిష్కరించాలి పెద్దూరులో ఆధ్యాత్మిక సందడి

వస్తువులు అడిగి పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగుడు

Select Suryaa Now
వస్తువులు అడిగి పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగుడు


మెలియాపుట్టి. నవంబర్ 13. మేజర్ న్యూస్...
మహిళ దృష్టి మరల్చి బంగారు పుస్తెలతాడును అపహరించిన ఘటన మెలియాపుట్టి  మండలంలోని డేగలపోలూరు గ్రామం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శనాపతి శ్రీదేవి (50) ఇంటి వద్ద ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల్లో ఒకరు షాపులోకి వెళ్లి వాటర్‌ బాటిల్‌, మిక్సర్‌ ప్యాకెట్‌, సేగోడీలు కావాలని అడిగాడు. వాటిని ఇచ్చేందుకు శ్రీదేవి వెనక్కి తిరగడంతో ఆమె మెడలోని సుమారు రెండు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని బయట వేచి ఉన్న మరో వ్యక్తితో కలిసి బైక్‌పై టెక్కలి వైపు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై మహమ్మద్‌ అమీర్‌ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.