అధ్యాపకుల కొరతను తక్షణమే పరిష్కరించాలి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూలో వివిధ విభాగాల్లో అధ్యాపక సిబ్బంది కొరతను తక్షణమే పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించేలా చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్ యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నే మల్లికార్జున డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రెక్టార్ చండ్రాయుడును, రిజిస్ట్రార్ భూపతినాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్సిటీలో పలు డిపార్ట్మెంట్లలో గత రెండేళ్లుగా అధ్యాపకులు లేక విద్యార్థులు సతమతమవుతున్నారని, వెంటనే టీచింగ్ అసిస్టెంట్లు, గెస్ట్ ఫ్యాకల్టీల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, ప్రవీణ్, మోహన్ కృష్ణ,విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్