BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

ఆలమూరులో న్యాయవాదులు నిరసనలు - విధులు బహిష్కరణ

Select Suryaa Now
ఆలమూరులో న్యాయవాదులు నిరసనలు - విధులు బహిష్కరణ

ఆలమూరు మేజర్ న్యూస్ : ఈవినింగ్ కోర్టు నిర్వహించాలని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆలమూరులో న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించడానికి కోర్టు సమయాన్ని పెంపుదల చేసి ఈవినింగ్ కోర్టును నిర్వహించాలని చేసిన ప్రతిపాదనకు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆలమూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టు ఆవరణలో ఈవినింగ్ కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిర్ణయం సరైనది కాదని వారన్నారు. ఈ కార్యక్రమానికి ఆలమూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడుఎస్ కె.షరీఫ్, న్యాయవాదులు సలాది సత్యనారాయణమూర్తి,  విత్తనాల వీర వెంకట సత్యనారాయణ మూర్తి  వేమగిరి నరసింహమూర్తి అబ్బులు నాయుడు గానుగుల శేషారావు, చల్లా సతీష్ తదితరులు పాల్గొన్నారు