హోదా కోసం కాదు.. గ్రామ అభివృద్ధి బాధ్యత కోసం మీలో ఒక్కడిగా ఉంటా..సర్పంచ్ అభ్యర్థి గడ్డం శివ
కడియం, మేజర్ న్యూస్ :కడియం మండలం కడియపులంక గ్రామంలో మీలో ఒక్కడిగా ఉంటూ ప్రజలతో మమేకమై ఉండే గడ్డం శివ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సర్పంచ్ పదవి అంటే హోదా కాదని, అధికారం ప్రదర్శించే అవకాశం అంతకన్నా కాదని, అది గ్రామ ప్రజల పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యత అని ఆయన తన ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు.గ్రామ అభివృద్ధి అనేది ఒక్కరి వల్ల సాధ్యమయ్యేది కాదని, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించగలమని ఆయన పేర్కొంటున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి అందుబాటులో ఉండే నాయకత్వం అవసరమని చెబుతున్నారు.సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే పదవిని అధికారంగా కాకుండా సేవా బాధ్యతగా భావించి పనిచేస్తాననే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, తాగునీరు, వీధి సమస్యలు వంటి ప్రజా అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ప్రచారం సాగిస్తున్నారు.