స్థానిక ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించిన డి.ఎస్.పి
హిందూపురం: - త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిల్లా ఎస్పీ ఎస్ .సతీష్ కుమార్ ఆదేశాల మేరకు
హిందూపురం డి.ఎస్.పి రవిబాబు , లేపాక్షి ఎస్సై నరేంద్ర , పోలీసు సిబ్బంది లేపాక్షి మండలంలోని బిసల మానేపల్లి , వెంకటాపురం, ఓబులాపురం గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడి ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ పాటించాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల నిబంధనలు, ప్రజా శాంతికి భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని డి.ఎస్.పి రవిబాబు సూచించారు.
ఎన్నికల సమయంలో గొడవలు, ఘర్షణలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
హిందూపురం సూర్య స్టాప్ రిపోర్టర్ నాగేంద్ర