ప్రధాన రహదారి సమస్య పరిష్కరించండి
గోపాలపురం, మేజర్ న్యూస్ :ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండల కేంద్రమైన గోపాలపురం అతలాకుతలమైన సంగతి తెలిసిందే అయితే మెయిన్ సెంటర్ నుంచిపెద్దగూడెం వెళ్లే ప్రధాన రహదారి వరద నీటి కారణంగా భారీగాగండి పడి రాకపోకలు నిలిచిపోయాయి దీంతో పెద్దగూడెం ప్రజల పాట్లు వర్ణనాతీతంగా మారాయి పెద్దగూడెం నుంచి ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతోనానా అవస్థలు పడుతున్నారు వాహనం లేని విద్యార్థులు బడిమానేసి ఇంటి వద్దనే ఉంటున్నారు ఇదిలా ఉంటే జ్వరం వచ్చిన తలపోటు వచ్చినా కనీసం టాబ్లెట్ కొనుక్కోవడానికి సైతంపెద్దగూడెంనుంచి సెంటర్ కు వెళ్లాల్సిందే పెద్దగూడెం ప్రజలుప్రధాన రహదారి సమస్యతోగత పది రోజుల నుంచినానా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు గాని అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో పెద్దగూడెం యువకులు కొందరు ప్రధాన రహదారికి పడిన గండిని పూడ్చి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పంచాయతీరాజ్ డి ఈ వెంకటలక్ష్మికి మండల పరిషత్ కార్యాలయంలోనూ పంచాయతీ కార్యదర్శి అనురాధకు వినతి పత్రం అందజేశారురోడ్డు సమస్యపై వెంటనే స్పందించిపరిష్కరించాలని వారా రేగులయ్య సూరిబాబు పెంటపాటి రమేష్ కె కిరణ్, దాసరి రవి తదితరులు అధికారులకు వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు.