BREAKING
సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ: గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్ కొత్త రేట్లు ఇవే నేటి పంచాంగం 14 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (14 నవంబర్ 2026, శనివారం): 12 రాశుల దినఫలాలు ఇవే మాస్కోలో భారీ కారు బాంబు పేలుడు: రష్యా అనుకూల నేత సెర్గీ జవోరోట్నీకి తీవ్ర గాయాలు అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు

పూలదండలకు బదులు పుస్తకాలు.. అభినందనల్లో వినూత్న ఒరవడి

Select Suryaa Now
పూలదండలకు బదులు పుస్తకాలు.. అభినందనల్లో వినూత్న ఒరవడి

                          ఎమ్మెల్యే గోరంట్లకు చిలుకూరి ప్రభాకర్ మిత్రబృందం వినూత్న సత్కారం

కడియం, మేజర్ న్యూస్ :ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులను అభినందించే సంప్రదాయానికి భిన్నంగా మండల కేంద్రం కడియం యువత వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పూలదండలు, బొకేలకు బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను బహుమతిగా అందిస్తూ అభినందనలు తెలిపింది. కడియం గ్రామానికి చెందిన యువ నాయకుడు చిలుకూరి ప్రభాకర్ తన మిత్రబృందంతో కలిసి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్‌తో పాటు ఎంపీపీ అభ్యర్థిగా విజయం సాధించిన బోడపాటి మోహిని వీర పుణ్యవతి గోపాలకృష్ణ దంపతులను పుస్తకాలతో అభినందించారు.
కడియం మండలంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ స్థానంతో పాటు 22 ఎంపీటీసీ స్థానాలకు గాను 20 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను కలిసిన చిలుకూరి ప్రభాకర్, ఆయన మిత్రబృందం శాలువాతో సత్కరించి పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో  యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.