BREAKING
ఆర్మ్ (Arm) సీఈఓ పదవి కోసం రేనే హాస్‌ను సంప్రదించిన ఎన్విడియా తెల్ల అన్నం మంచిదా లేక బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మేలా.. అసలు నిజాలు ఇవే! డిజిటల్ కంటెంట్ బిల్లును రెండోసారి వీటో చేసిన పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రాకి పూలదండలకు బదులు పుస్తకాలు.. అభినందనల్లో వినూత్న ఒరవడి ప్రముఖ పిల్లల పుస్తకాల రచయిత, హాస్యనటుడు డేవిడ్ వాలియమ్స్‌పై దర్యాప్తునకు లండన్ పోలీసుల నిర్ణయం బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలకే భారత్ పెద్దపీట స్థానిక ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించిన డి.ఎస్.పి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్న దీప్తి శర్మ.. రెండోసారి అరుదైన ఘనత! గుజరాత్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ: సీఎం, మంత్రులతో విందు సమావేశం అస్సాం ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం కేన్సర్ మందుల ధరల నియంత్రణపై ఎన్‌పీపీఏ కఠిన నిఘా గురు అతిచారం 2026-27 | సింహరాశిలో గురు సంచార ఫలితాలు | Jupiter Transit in Leo | 12 రాశుల ఫలితాలు by Dr Edupuganti Padmaja Rani నజాఫ్‌గఢ్ రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్‌లో వైద్య సేవలను సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసుల ఫ్లాగ్ మార్చ్ అమల్ నీరద్ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి మస్త్ సాంగ్.. పారిస్ లక్ష్మి అదిరిపోయే డైన్స్ మూవ్స్‌తో చింతామూక గీతం విడుదల!

ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వద్దు

Select Suryaa Now
ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వద్దు

 

పార్వతీపురం మన్యం, నవంబర్ 13:మేజర్ న్యూస్ :
జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలు, డిజిటల్ హెల్త్ సేవలను నిర్దేశిత లక్ష్యాల మేరకు సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. విజయలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం పార్వతీపురంలోని జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారులు, జిల్లాలోని అన్ని వైద్యాధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, వైద్యాధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఎ బి డి ఎం కార్యక్రమం కింద క్యూ ఆర్ కోడ్ కోడ్ స్కానింగ్, సంబంధిత లాగిన్ ప్రక్రియలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులతో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రత, సమయపాలన పాటిస్తూ ప్రజల్లో ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకం పెంపొందించేలా పనిచేయాలన్నారు. జిల్లాలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని, ముఖ్యంగా 14 సంవత్సరాల బాలికలకు హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో అమలు చేయాలని ఆదేశించారు. టీకాలు పొందని అర్హులైన బాలికలందరినీ గుర్తించి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి హెచ్ పి వి టీకాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా వ్యాధిగ్రస్తులను ముందస్తుగా గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం, సకాలంలో చికిత్స అందించడం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం వంటి చర్యలను ముమ్మరం చేయాలని తెలిపారు.సంజీవని కార్యక్రమం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన సన్నాహక చర్యలను సమీక్షించారు. పి హెచ్ సి లు, ఇతర ఆరోగ్య సంస్థల్లో పనిచేస్తున్న వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు అవసరమైన శిక్షణ అందించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో డిసెంబర్ నెలాఖరులోగా ఆరోగ్య స్క్రీనింగ్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అంటువ్యాధుల నియంత్రణకు పారిశుధ్య కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని, అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. తాగునీటి నాణ్యతను పర్యవేక్షిస్తూ క్లోరినేషన్ చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో ప్రత్యేక ఆరోగ్య పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.జ్వరం, డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులపై నిరంతర నిఘా ఉంచాలని, వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన మందులు, వైద్య సిబ్బంది, అత్యవసర వైద్య సేవలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని డా. పి. విజయలక్ష్మి వైద్యాధికారులకు స్పష్టం చేశారు.