భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు పాముల పుట్టల వద్ద పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు
రావులపాలెం మేజర్ న్యూస్ నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గంలో శుక్రవారం భక్తులు వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలు, పాముల పుట్టల వద్ద భక్తులు బారులు తీరారు. గంటి గ్రామంలోని వరాల నాగమ్మ తల్లి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అలాగే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పంట పొలాల వద్ద ఉన్న పాముల పుట్టలకు మహిళలు, భక్తులు పాలు పోసి, కోడిగుడ్లు, చిమ్నీ, ప్రసాదాలు సమర్పించి పూజలు చేశారు. తమ చిన్నారులకు ఆయురారోగ్యాలు కలగాలని పుట్ట వద్ద బూరెలు వేసి మ్రోక్కులు తీర్చుకున్నారు నాగదేవతను ఆరాధిస్తూ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.