గురు అతిచారం 2026-27 | సింహరాశిలో గురు సంచార ఫలితాలు | Jupiter Transit in Leo | 12 రాశుల ఫలితాలు by Dr Edupuganti Padmaja Rani
గురు అతిచారం 2026-27 | సింహరాశిలో గురు సంచార ఫలితాలు | Jupiter Transit in Leo | 12 రాశుల ఫలితాలు by Dr Edupuganti Padmaja Rani - సూర్య న్యూస్ (Suryaa News)
మేషరాశి.... (అశ్విని 1 2 3 4, భరణి 1 2 3 4, కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)
నవమ, వ్యయాధిపతి అయిన గురుడు సింహరాశిలో అతిచారముతో ప్రవేశం వలన ఆధ్యాత్మిక వ్యవహారాలలో, ఉన్నత విద్య,దూర ప్రయాణలు. వ్యక్తిగత విషయాలు వృద్ధి, ఆకస్మిక లాభాలకి అవకాశాలు. ముఖ్యంగా ఈ సమయంలో ఆలోచనలలో వేగం, తొందరపాటు నిర్ణయాలు, పెట్టుబడులు లాభాల విషయాలలో అననుకూలతలు. ప్రియమైన వారితో ఘర్షణ, మానసిక ప్రశాంతత తక్కువ. ముఖ్యంగా అతిచారంలో గురుగ్రహం వక్రీంచినప్పుడు మేష రాశి వారికి ఆలోచనల అతివేగం, తొందరపాటు నిర్ణయాలు, ఆత్మీయుల సహకారంతో నియంత్రించు కోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ఏకాగ్రత పెంపొందించుకోవాలి. హయ గ్రివాయ నమః మంత్రాన్ని జపించాలి., శ్రీ దత్త శరణం మమ మేలు చేస్తుంది.
వృషభరాశి...(కృతిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)
అష్టమ లాభాధిపతి అయిన గురుడు చతుర్దములో సింహరాశిలో అతిచారముతో ప్రవేశించడం వల్ల గృహసౌఖ్యం, స్థిరాస్తులు, విద్యా విషయాలు ప్రశాంతత, అంశాలలో తొందరపాటు ఆలోచనలు నిర్ణయాలు వలన అననుకూలత దృష్ట్యా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిలో శ్రమ, అనుకోని పరిస్థితు లు.ఆకస్మిక లాభములు ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు అధికం. ముఖ్యంగా అతిచారములో గురు గ్రహ వక్ర సమయంలో గృహ, మాతృ, స్థిరాస్తుల యందు, ఖర్చులలో, నిర్ణయాల వేగం వల్ల చికాకులు అధికం. దత్తాత్రేయ ఆరాధన మేలు చేస్తుంది.
మిధున రాశి...(మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)
సప్తమ దశమాధిపతి అయిన గురుడు తృతీయంలో సింహరాశిలో అతి చారముతో ప్రవేశించడం వల్లవ్యక్తుల సహకారం, సామాజిక సంబంధాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో, కమ్యూనికేషన్ లో తొందరపాటు లేకుండా ఆత్మీయుల సహకారంతో ఆలోచించి పనులు చేయడం వల్ల అనుకూలతలు. స్నేహ సంబంధాలలో, తండ్రి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ అవసరం. లాభాల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి సజ్జన సహకారంతో ముందుకు వెళ్లాలి. ముఖ్యంగా అతిచారములో గురు వక్ర సమయములో నిర్ణయాలలో ఆత్మీయుల సలహా సహకారం అవసరము. దత్తాత్రేయ మందిరాలు దర్శించడం మేలు
కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)
షష్ట భాగ్యాధిపతి అయిన గురుడు ద్వితీయ స్థానంలో సింహరాశిలో అతిచారముతో ప్రవేశించడం వల్ల కుటుంబ వ్యవహారాలలో ఆర్థిక అంశాలలో మాటలలో, ఆలోచనలలో వేగం వలన కుటుంబ సంబంధాలు, ధనసంబంధ చికాకుల ఇబ్బంది. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నంచేసే శత్రువులు ఇబ్బంది పడతారు. ఆకస్మిక లాభాల విషయం లో తగిన జాగ్రత్తలు అవసరం. వృత్తిపరంగా శ్రమ, పని ఒత్తిడి అధికం. ముఖ్యంగా అతిచార గురు వక్రీంచిన సమయంలో వాక్కు వలన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఆచితూచి వ్యవహరించడం వల్ల ప్రయోజనాన్ని పొందుతారు. దత్తాత్రేయ ఆరాధన మేలు చేస్తుంది.
సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)
పంచమ, అష్టమాధిపతి అయిన గురుడు సింహరాశిలో జన్మములో అతిచారము చే ప్రవేశించడం వల్ల వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆలోచనలలో పొరపాటు రాకుండా ఆచితూచి నిర్ణయాలు, జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక సంబంధాలలో మధ్యమ ఫలితాలు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా తగిన దృష్టి సారించాలి. వ్యాపార వ్యవహారాలలో చేసే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా రాశిలో అతిచార గురు వక్రించిన సమయంలో ఆలోచనలలో, ఆరోగ్య విషయాలలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. దత్తాత్రేయ ఆరాధన మేలు చేస్తుంది.
కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4, హస్త 4, చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)
చతుర్ధ సప్తమాధిపతి అయిన గురుడు అతిచారముతో సింహరాశిలో వ్యయ స్థానంలో ప్రవేశించడం వల్ల దానధర్మాలు, తీర్థయాత్ర, ఆధ్యాత్మిక ఖర్చులు. గృహ నిర్మాణ నిమిత్తం కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అయితే చింతామణి గృహంతస్థా శ్రీమన్నగరనాయక జపం మంచిది. శత్ర రోగ రుణాలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్య విషయం కొంత అనుకూలం ఆకస్మిక ఆదాయాన్ని కూడా అవకాశం లభ్యం. ముఖ్యంగ అతిచారములో గురు వక్రించిన సమయంలో తీర్థయాత్ర దానధర్మాలు పై దృష్టి అధికం. మంచి ఖర్చులు. దత్త ఆరాధన మేలు.
తులా రాశి...(చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)
తృతీయ షష్ఠాధిపతి అయిన గురుడు అతిచారముతో లాభములో సింహరాశిలో ప్రవేశించడం వల్లఆదాయాన్ని వేగవంతంగా చేసిన అంతే వేగంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సజ్జన సహకారం అనుకూలం. సంతానం అభివృద్ధి లోకి వస్తుంది. ఆ విషయంలో వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటే నష్టానికి అవకాశం ఉంటుంది.నూతన స్నేహసంబంధాలు ఏర్పడే అవకాశం, వాటిని నిలబెట్టు కోవడానికి అధిక శ్రమపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా అతిచారములో గురు వక్రించిన సమయంలో ఆదాయ విషయంలో, సంతాన వృద్ధిలో వేగంగా నిర్ణయాలు ఇబ్బందికి అవకాశాలు. దత్త మందిరాలు దర్శించడం మేలు.
వృశ్చిక రాశి...(విశాఖ 4, అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)
ద్వితీయ పంచమాధిపతి అయిన గురుడు రాజ్యములో సింహరాశిలో అతిచారముతో ప్రవేశించిన సమయంలో వృత్తి విషయాలలో, వృత్తి చేసే ప్రదేశాలలో శ్రమ, చాలా మార్పులకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో కుటుంబ విషయాలలో మేలు జరుగుతుంది. స్థిరాస్తుల విషయాలలో వేగవంతమైన నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి. శత్రు, రోగ, రుణాల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా అతిచారములో గురు వక్రించిన సమయంలో వృత్తి విషయాలలో శ్రమ, ఒత్తిడి చికాకులు, మార్పులు అవకాశం. దత్త చరిత్ర పారాయణ మేలు.
ధను రాశి...(మూల 1 2 3 4, పూర్వాషాఢ 1 2 3 4, ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)
లగ్న చతుర్ధాధిపతి అయిన గురుడు నవమంలో సింహరాశిలో అతిచారముతో ప్రవేశించినప్పుడు తండ్రి విషయంలో, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక అంశాలు పై కూడా శ్రద్ధ అవసరం. శ్రమ అధికమైన గౌరవం బాగుంటుంది. జన సహకారం అనుకూలం. సంతాన అభివృద్ధి కూడా బాగుంటుంది, అయినప్పటికీ నిర్ణయాలు వేగ వంతంగా తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా అతిచార గురుగ్రహ వక్రము వల్ల తండ్రి, పెద్దలఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. దత్తాత్రేయ స్తోత్రాలు మేలు.
మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)
తృతీయ వ్యయాధిపతి అయిన గురుడు అష్టమ స్థానంలో సింహరాశిలో అతిచారముతో ప్రవేశించడం వల్ల వ్యక్తిగత ఆరోగ్య విషయంలో అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అధిక ఖర్చులు చేస్తారు. ఆకస్మిక మార్పులు, నూతన ఆధ్యాత్మిక విద్యలపై, మెడిటేషన్ వంటి వానిపై ఆసక్తి. ఆర్థిక విషయాలు అనుకూలం. గృహము, స్థిరాస్తి, వారసత్వ ఆస్తుల వంటి విషయంలో వేగవంతమైన నిర్ణయాల వల్ల నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా అతిచారములో గురు వక్ర సమయంలో ఆరోగ్య శ్రద్ధ అవసరం, అధిక ఖర్చుల అవకాశం. దత్తాత్రేయ మందిరాలు, ఆరాధన మేలు చేస్తాయి.
కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)
ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు సప్తమములో సింహరాశిలో అతిచారముతో ప్రవేశించడం వల్ల సామర్థ్యము పెరుగుతుంది. స్నేహ సంబంధాలు, భాగస్వామ్య వ్యవహారాల పై దృష్టి. లాభాల విషయంలో ఆశించిన మేలు జరుగుతుంది. జన సహకారం, ముఖ్యంగా సజ్జన సహకారం అనుకూలం. వ్యక్తిగత నిర్ణయాలలో మార్పులు, ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులు. ముఖ్యంగా అతిచారములో గురు వక్రించిన సమయంలోఅనుకూలతలు, సామర్థ్యం, వృద్ధి. సంఘంలో మంచి స్నేహ సంబంధాలు. శ్రీ దత్త శ్శరణం మమ అనుకూలం.
మీన రాశి...(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
లగ్న రాజ్యాధిపతి అయిన గురుడు షష్ఠ స్థానములో సింహరాశిలో అతిచార ప్రవేశం వలనశత్రు రోగ రుణాల వల్ల ఇబ్బంది ఉన్నప్పటికీ నైపుణ్యాలు కృషిశీలత వృద్ధి చేసుకుంటారు. ఇతరులపై విజయాన్ని సాధిస్తారు. వృత్తిపరమైన విషయంలో అభివృద్ధి. ఖర్చులు అధికమైన అవి మంచి ఖర్చులు అవుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. నిర్ణయాలు త్వరితగతిన కాకుండా ఆచితూచి తీసుకోవాలి. ఆత్మీయులను సంప్రదించాలి. ముఖ్యంగా అతిచారములో గురుగ్రహం వక్రీంచటం వల్ల కృషిశీలత, నైపుణ్యాలు పెంపొందించు కుంటూ శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు. దత్తాత్రేయుని ఆరాధన మంచిది.
గమనిక: ఇవి జనరల్ రాశి ఫలాలు. ఒక వ్యక్తికి ప్రత్యేకంగా కాదు. ఇవి చంద్రరాశి ఆధారిత గోచార ఫలాలు. వ్యక్తి జన్మసమయ, స్థల వివరాలతో ఏర్పడిన జన్మకుండలి లోని దశ-అంతర్దశలతో కలిపి చూస్తేనే సరియైన అవగాహన వస్తుంది. గోచార గ్రహఫలాలు తక్కువగా ఉన్నా దశలు శుభంగా ఉంటే ప్రభావం స్వల్పమే. చిన్న పరిహారాలతో శుభ ఫలితాలు పొందవచ్చు.
డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant
email : padma.suryapaper@gmail.com