నాగపూజ – సంతాన భాగ్యానికి జ్యోతిష్య రహస్యం | Naga Pooja & Progeny Blessings
నాగపూజ – సంతాన భాగ్యానికి జ్యోతిష్య రహస్యం | Naga Pooja & Progeny Blessings
నాగపూజ - ఉత్తమ సంతానయోగానికి జ్యోతిష్య సూత్రం
నాగం సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం. ఆయన ఆదిపుత్రుడు,అందుకే ఆయనకి కుమారుడు అని పేరు. అదిపుత్రుడు అంటే బ్రహ్మ గారికి పుట్టిన సంతానం మనసుతో పుట్టింది. విష్ణువుకి కూడ మన్మధుడు మనసునుండీ పుట్టెడు. ఒక్క ఈయనే రేతస్సు ద్వారా జన్మించాడు. అందుకే కుమారుడిగా ఉన్నాడు. ఈయన శక్తి ఏంటంటే లౌకిక, ఆధ్యాత్మిక శక్తి కలిపి ఉండటం, ఆకారణాన లౌకిక ఆధ్యాత్మిక రంగాల్లో సమన్వయశక్తి ఏర్పడడం కోసం మనం సుబ్రహ్మణ్య స్వామి ని ప్రార్ధిస్తాం. దానిలో కుండలిని శక్తి ఆధ్యాత్మిక శక్తి అయితే, సంతానం అనేది లౌకిక శక్తి ఆ రెండూ ఆయన వల్ల సిద్ధిస్తాయి. ఆయన కోసం నాగుల చవితి చేస్తాం అవి సుబ్రహ్మణ్య స్వామి ప్రతికలు కాబట్టి.
మనకు బీజం నుంచి నాగ స్వరూపం కనబడుతుంది. బీజం ప్రయాణంలో ముందు పెద్ద భాగం వెనుక భాగం తోకతో వంకర్లు తిరుగుతూ ప్రయాణిస్తుంది. అలాగే సంతానమునకు నాగమునకు అనుబంధం ఉంది అనే విషయం నిర్ధారణ అవుతుంది. చెవులకు కళ్ళకు సంబంధించి అనారోగ్యాలు కలగకుండా నాగదేవతను ప్రార్ధించి పూజించి పుట్టమన్ను తెచ్చి చెవులకు పెట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా కళ్ళకు కూడా రాసుకుంటారు.అలా మన చేతిలో ఉండే ప్రక్రియలు ఇవన్నీ అంటే మనం ప్రార్ధించే ప్రక్రియలు ఇవి అన్ని అన్నమాట
ప్రాచీనమైన పూజ నాగపూజ అనడంలో అతిశయోక్తి లేదు. ఇంద్రునికి శత్రువైన వృత్తాసురుడు ఇదే ఆకృతి కలవాడు, ఎలాగా అంటే జాగ్రత్తగా గమనిస్తే వృత్త సురుడు అంటే సుడిగాలి, సుడిగాలి తిరుగుతూ ఉంటుంది, ఆ సుడిగాలి తిరిగే విధానం చూస్తే పాము ప్రయాణించే విధానం. అతిముఖ్యంగా సర్పం అలానే కనబడుతుంది
విష్ణుమూర్తికి శయ్యగానే ఉంది, పరమేశ్వరునికి కంఠాభరణం, ఇక గణపతికి మొలతాడుగా.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపంగానే ఉంది.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరుముఖాలు ఉన్నాయి: ఆ ఆరు ముఖాలు అలౌకిక, లౌకిక జ్ఞానాలకు సమన్వయంగా సూచిస్తారు. అందులో మూడు ముఖాలు లౌకిక జ్ఞానానికి సంకేతం అనుకున్నాం కదా అదే ఆహారశక్తి ఆరోగ్య శక్తి చుట్టూ ఉన్న వ్యక్తులతో అనుకూలత శక్తి. మిగిలిన మూడు ముఖాలు అహంకార, మమకార, సంకల్పాల ప్రతీక - ఆధ్యాత్మిక శక్తి. కుండలిని శక్తికి సంకేతం పాము- సంతానానికి సంకేతం పాము, ఈ సర్పమే సుబ్రమణ్య స్వామికి ప్రతీక.
ఈ భూమిని మోసేది వాసుకి అనే సర్పం. ఈ పాములను ఆరాధించేది రైతులు అధికంగా చేస్తారు వాళ్లు పాలతో పాటు, తాము తీసుకునే ఆహారంలో పాములు స్వీకరించే ఆహారాన్ని నైవేద్యంగా చేస్తారు. ఈ కాలంలో శ్వాసకోశ వ్యాధులు కలగకుండా కూడా ఈ నాగపూజ ఉపకరిస్తుంది. కుండలిని శక్తి అనేది అన్ని చక్రాలలో స్పృశిస్తూ పైకి వస్తుంది. అనగా మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు, అది కూడా సర్పాకారంలో ఉంటుంది. ఈ చక్రం లలో ఆ శక్తి నిరాఘటంగా ప్రయాణిస్తూ ఉంటే మనకి ఈ రకమైన వ్యాధులు దరి చేరవు. ఇళ, పింగళి నాడులు గమనాన్ని సూచన చేసేది మనకు పూర్తిగా జీవశక్తి అన్నమాట గమనిస్తే ఆధునిక వైజ్ఞానికులు వైద్యానికి సంకేతంగా, అనగా సింబల్‌గా పెట్టుకునేది కూడా ఈ ఆకృతిలోనే కనిపిస్తుంది
ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పం, ఇక్కడ మనం ఒక సూత్రాన్ని గమనిస్తే, కృత్తికలో సూర్యుడు ఉన్నపుడు భూమి అంతా వేడిగా ఉంటుంది. అధిష్టాన దేవతా అగ్ని, రోహిణి లో సూర్యుడు ఉన్నపుడు మొక్కలు మోలుస్తాయి దానికి అధిష్టాన దేవత బ్రహ్మ మృగశిర నక్షత్రం దగ్గరకి వచ్చేసరికి కొంచం ఆ మొక్కలు పైకి లేచి లేడి మొహం లా, కొమ్ములు లా కనిపిస్తూంటాయి అన్నమాట ఆ మొక్కలు, , ఆరుద్ర నక్షత్రం వచ్చేసరికి అంటే దానికి తడి పెడుతుంటారు, నీళ్లు పెడతారు. ఆరుద్ర అంటే తడి, అధిపతి శివుడు, శివుడే జలము కూడ ఇస్తాడు. ఆ జలము వచ్చిన తర్వాత మొక్కలు మళ్ళీ పీకుతారు, మళ్ళీ నాటుతారు, దేనికోసం అంటే పునః వసు అంటే మరల నాటటం అనేది పంట ఎక్కువ రావటం కోసం జరుగుతుంది. మాములుగా నాట్లు అంటారు వాటిని. ఆ పునర్వసు తర్వాత పుష్యమి అంటే పోషించటం, అంటే దాని అధిష్టానదేవత బృహస్పతి, బుద్ధిశక్తి తో వాటిని కాపడుతూ సంరక్షిస్తూ పోషిస్తాడు అన్నమాట. ఇక ఆశ్రేష.... కొచం మొక్కలు పైకి వచ్చేసరికి ఎలుకలు అచ్చట సంచారిస్తూ ఉంటాయి. అలా సంచరిస్తూ మొక్కలని కూడ కొరికేస్తాయి. అలా కొరికేయాకుండా ఉండేలాగ ఆ ఎలుకలన్నిటిని గా తినేసి పాములు పంటలను కాపాడతాయి. అందుకని ఆశ్రేష నక్షత్రానికి ఆ క్రమం లో పాముల యొక్క ప్రాధాన్యం అనేది సూచితమవుతూ ఉంటుంది. ఆశ్రేష కి అధిష్టాన దేవతా నాగులు (పాములు)అనుకున్నాం కదా?
పాము విష జంతువు కావటం వలన కొంతమంది చంపి వేస్తారు ఆ చంపడం వలన సంతాన దోషం సంతానానికి వినికిడి శక్తి లోపించడం వంటివి చూపు కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి అనే భావన సాంప్రదాయంలో గోచరిస్తుంది
ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ నాగులను పూజ చేస్తే నాగులను మన పూర్వీకులు చంపిన పాపాన్ని జయించగలుగుతామని, సర్ప దోషకం జాతకంలో ఉన్నప్పుడు దాన్ని తొలగించుకోగలమని చెబుతారు. వంశం అలా తరతరాల్లో ఇబ్బంది పడకుండా ఉండడానికి నాగులను పూజ చేస్తారు. దాన్నే వేదాల దగ్గర నుండి కూడా ఈ విషయాన్ని బోధన చేస్తున్నాయి.
“తైత్తిరీయ సంహిత” కృష్ణ యజుర్వేదానికి చెందిన అత్యంత ప్రాచీనమైన, ప్రసిద్ధమైన సంహిత.
ముఖ్య విశేషాలు:
వేద శాఖ: ఇది కృష్ణ యజుర్వేదంలోని 'తైత్తిరీయ శాఖ'కు చెందినది.
నిర్మాణం: ఇందులో మొత్తం 7 కాండలు (పుస్తకాలు), 44 ప్రపాఠకాలు (అధ్యాయాలు) ఉంటాయి
కృష్ణ యజుర్వేదానికి చెందిన తైత్తిరీయ సంహిత (4.2.8) లో అత్యంత శక్తివంతమైన "సర్ప సూక్తం" (దీనినే సుబ్రహ్మణ్య సూక్తం అని కూడా అంటారు) ప్రస్తావించబడింది. ఈ సూక్తంలో సర్ప దేవతలను పూజించడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలను వేదాలు వివరించాయి.
తైత్తిరీయ సంహిత ప్రకారం నాగ పూజ లేదా సర్ప సూక్త పఠనం వల్ల కలిగే ముఖ్యమైన ఫలితాలు:
సర్ప దోష, కాలసర్ప దోష నివారణ: జాతకంలో రాహు-కేతువుల ప్రభావం వల్ల ఏర్పడే కాలసర్ప దోషాలు, నాగ దోషాలు మరియు పితృ దోషాల తీవ్రత పూర్తిగా తొలిగిపోతుంది.
భయ నివారణ & రక్షణ: విషసర్పాల వల్ల కలిగే ప్రమాదాలు, అకాల మృత్యు భయాలు తొలగుతాయి. నిత్య జీవితంలో ఎదురయ్యే శత్రు భయాలు, కంటికి తెలియని నకారాత్మక శక్తుల నుండి రక్షణ లభిస్తుంది.
సంతాన ప్రాప్తి: వంశపారంపర్యంగా వచ్చే నాగ దోషాల వల్ల సంతాన లేమితో బాధపడే వారికి, నాగ పూజ చేయడం ద్వారా సత్సంతాన యోగం కలుగుతుందని నమ్మకం.
గ్రహ దోషాల శాంతి: ముఖ్యంగా జాతకంలో శని, రాహు, కేతు గ్రహాల చెడు ప్రభావాలు తగ్గి, జీవితంలో మానసిక ప్రశాంతత మరియు అన్ని కార్యాల్లో విజయం చేకూరుతుంది.
ప్రకృతితో సామరస్యం: భూమిపై, అంతరిక్షంలో, స్వర్గంలో, సూర్య కిరణాలలో మరియు జలంలో నివసించే సర్వ సర్పాలకు ఈ మంత్రం ద్వారా నమస్కరించడం వల్ల ప్రకృతి అనుకూలత లభిస్తుంది.
తైత్తిరీయ సంహితలోని ప్రధాన నాగ మంత్రం:
నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను |
యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ||
ఈ మంత్రాన్ని లేదా సర్ప సూక్తాన్ని నాగుల చవితి, నాగ పంచమి లేదా ప్రతిరోజూ ఉదయం-సాయంత్రం భక్తితో స్మరించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి.
సర్పాలను పూజించటం, రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేయడం, నాగ ప్రతిష్ట, పుట్టదగ్గర పాలు గుడ్లు సమర్పిస్తున్నారు.
నగర ప్రాంతం కాబట్టి పుట్టలు దొరక కున్నా ఇంట్లో చలిమిడితో జంట నాగులుగా తయారుచేసి గోడకు అద్దె దానికి పూజ చేసి నాగుల చవితి నాడు ఉపవాసం ఉండి వేడి పదార్థాలు తీసుకోరు.
నువ్వుల చిమ్మిరి చలిమిడి తీసుకొని ఉపవాసం చేస్తారు. చలిమిడిలో కొబ్బరి కలపడం వల్ల వరి వలన ఏర్పడే దోషాన్ని కొబ్బరి హరిస్తుంది. కొబ్బరి వల్ల ఏర్పడే జలుబు దగ్గును మరి నివారిస్తుంది.
ఇక చిమ్మిరి గర్భాధారణం దోషాలని పూర్తిగా నివారిస్తుంది. అలాగే నాగుల చవితి ఉత్తమ సంతానం కలగడానికి ఆచరించాల్సిన ప్రక్రియ గుర్తించాలి.
రెండు పాములు దంపతులకు సంకేతం భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఇక ఇళ పింగళ నాడులకి సంకేతం.
మన వైద్యుల సింబల్స్ చూస్తే కుండలిని శక్తికి జంటనాగులకి సంకేతంగా కనిపిస్తుంది. అంటే ఇది అనే దానిని ప్రపంచవ్యాప్తంగా అంతర్లీనంగా ఉన్న భావన అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
మొత్తం పైన శారీరక మానసిక ఆరోగ్యానికి, లౌకిక జీవనానికి ఉత్తమ సంతానానికి వంశవృద్దికి, చెవి, కన్ను దోషాలు పిల్లలకి లేకుండా ఉండడానికి జాతకంలో ఉన్న నాగ దోషం నివారణకి ఉపకరించేది నాగుల పూజ.
డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant
email : padma.suryapaper@gmail.com