గ్రామ పంచాయతీల పోరుకు మోగిన నగారా..
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.
ఈనెల15 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
సీతానగరం, నవంబర్ 13, మేజర్ న్యూస్:గ్రామ పంచాయతీల ఎన్నిక లకు సంబంధించి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం అధికారులు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం తొలి విడత జరగనున్న పంచా యతీల ఎన్నికలకు సంబంధించి విడు దల చేసిన నోటిఫికేషన్ వివరాలను మండల పరిషత్తు అభివృద్ధి కార్యాల యంలోని నోటీస్ బోర్డులో అతికించా రు. మండలానికి సంబంధిం చి తొలి విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు ఈనెల 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే అప్పలనాయుడు పేర్కొన్నారు.తొలి దశలో ఎన్నికలు జరిగే పంచాయతీలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం శుక్రవారం అధికారికంగా విడుదల చేయడం జరిగిందన్నారు.ఈ నెల 15 వ తేదీ నుండి 17 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీక రించడం జరుగుతుందన్నారు.ఈనెల 18వ తేదీన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుందన్నారు.ఈనెల 19వ తేదీన అప్పీళ్ళు దాఖలు చేసుకో వలసి ఉందన్నారు.20 వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ,అదే విధం గా 21వ తేదీన తుది జాబితా ప్రకటిం చడం జరుగుతుందని ఎంపీడీవో ఎంఎల్ఎన్ ప్రసాద్ తెలిపా రు.ఈనెల 26వ తేదీన ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని.
అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఫలితాలను వెలువడించడం జరుగుతుందని ఎంపీడీవో వెల్లడించారు.