పెద్దూరులో ఆధ్యాత్మిక సందడి
నందెన్న దర్శనానికి తరలివచ్చిన భక్తులు
నాగులచవితి సందర్భంగా జాతర
గరుగుబిల్లి, నవంబర్ 13, మేజర్ న్యూస్:నాగుల చవితి సందర్భంగా శుక్రవారం మండలంలోని పెద్దూరు గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.గౌరీపౌర్ణమి సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధిలో ప్రతిష్టించిన నందెన్నను నాగుల చవితి వరకు 21 రోజుల పాటు దూప, దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.అనంతరం రాత్రి అనుపోత్సవాన్ని నిర్వహిస్తారు.ఇందులో భాగంగా నాగుల చవితి రోజున నందెన్నను దర్శించుకునేందుకు సమీప గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు శివపార్వతులను దర్శించుకుని తమ మొక్కు లను చెల్లించుకున్నారు. నందెన్నను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.ఈ సందర్భంగా నిర్వహించిన భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.