హైదరాబాద్‌క రాహుల్ గాంధీ పర్యటన.. రేప గిగ్ వర్కర్లతో భారీ ర్యాలీ, సంక్షేమ పథకాల ప్రారంభం
హైదరాబాప్ :లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు (శనివారం) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంటకు నగరానికి చేరుకోనున్న ఆయన, ఉదయం గిగ్ వర్కర్ల భారీ ర్యాలీ మరియు బహిరంగ సభలో పాల్గొంటారు. మాదాపూర్‌లోని శిల్పకళావేదిక నుంచి హెచ్‌ఐసీసీ (HICC) వరకు డెలివరీ బాయ్స్, క్యాబ్, ఆటో డ్రైవర్లతో కలిసి రాహుల్ గాంధీ ర్యాలీగా వెళ్లనున్నారు. అనంతరం హెచ్‌ఐసీసీ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభా వేదికపై గిగ్ వర్కర్లతో ఆయన నేరుగా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. భారత్ జోడో యాత్రలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన 'తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యాక్ట్–2026' విధివిధానాలు, సామాజిక భద్రత, ప్రమాద బీమా సంక్షేమ పథకాలను రాహుల్ గాంధీ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని సుమారు ఆరు లక్షల మంది గిగ్ కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకుని, ప్రభుత్వ సేవలు మరియు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను వినియోగించుకునేందుకు వీలుగా రూపొందించిన ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను కూడా ఈ వేదికపై ఆవిష్కరించనున్నారు. రాజకీయాలకు అతీతంగా కేవలం గిగ్ కార్మికుల కోసం నిర్వహిస్తున్న ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం హైటెక్స్‌లో జరుగుతున్న 'భారత్ సమ్మిట్' ముగింపు వేడుకలకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.