BREAKING
స్వచ్ఛమైన ఇంధన సామర్థ్య విస్తరణలో దూసుకుపోతున్న భారత్ విమానంలో పవర్ బ్యాంక్ పేలుడు కలకలం అంబాజీపేట మండలంలో వైభవంగా నాగుల చవితి: పుట్టల్లో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఇండియాస్ గాట్ లేటెంట్ వేదికపై టాక్సిక్ సినిమా వసూళ్లపై సమయ్ రైనా సెటైర్లు.. నటి హుమా ఖురేషి అదిరిపోయే కౌంటర్! జూలపల్లి మండలానికి 406 నూతన పింఛన్లు మంజూరు పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు కర్ర సత్య ప్రసన్నారెడ్డి"ని అభినందించిన "అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి".. మైసూరూలో దేశపు మొదటి ఎల్ఈడీ డోమ్ ప్లానెటోరియంను ప్రారంభించిన ప్రధాని మోదీ వెటర్నరీ ఫిజియాలజీలో క్విజ్ పోటీలు దుమ్ముతో ఇబ్బందులు తొలగించాలని కార్యదర్శికి వినతి. కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా 'జాతీయ గౌరవ దినోత్సవం' సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు ఆశ వర్కర్ల వినతి. బహ్రెయిన్‌లోని యూఎస్ రాడార్ వ్యవస్థపై దాడి చేశామన్న ఇరాన్ స్వచ్ఛంద ఏకగ్రీవాలతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి అటజని కంచె ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న బాల 369 టీజర్ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు పాముల పుట్టల వద్ద పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు

సీఎం సభకు 16 ఎకరాల స్థలం ఖరారు! నాగదేవత ఆలయం సమీపంలో భారీ బహిరంగ సభ ప్రాంగణం

Select Suryaa Now
సీఎం సభకు 16 ఎకరాల స్థలం ఖరారు! నాగదేవత ఆలయం సమీపంలో భారీ బహిరంగ సభ ప్రాంగణం

సిద్దిపేట, lఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటన నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సభా ప్రాంగణం ఏర్పాట్ల కోసం ఎంపిక చేసిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి, పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్‌తో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ముఖ్యమంత్రి సభ కోసం తొలుత జిల్లా కేంద్రంలోని నాగదేవత ఆలయం నుంచి సిరిసిల్లకు వెళ్లే బైపాస్ రహదారి వెంబడి స్థలాన్ని ఎంపిక చేయాలని భావించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ స్థలాన్ని మార్చినట్లు కలెక్టర్ తెలిపారు. నాగదేవత ఆలయం ముందు భాగంలోని నందాల వెంకటలక్ష్మి గార్డెన్ వెనుక, బైపాస్ రహదారి, చిన్నగుండవెల్లి రహదారికి ఆనుకొని ఉన్న దాదాపు 16 ఎకరాల స్థలాన్ని భారీ బహిరంగ సభ ప్రాంగణానికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

సభా ప్రాంగణం పనులు వేగవంతం చేయాలి..

ఎంపిక చేసిన స్థలానికి సంబంధించి సరిహద్దులను ఖరారు చేయాలని సర్వే, రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సభా ప్రాంగణంలో ఉన్న చెట్లపొదలు, పిచ్చిమొక్కలను తొలగించి, డోజర్ సహాయంతో స్థలాన్ని పూర్తిస్థాయిలో చదును చేసి శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు.స్థలాన్ని శుభ్రం చేసిన అనంతరం సభా వేదిక, అత్యంత ముఖ్యమైన అతిథుల వాహనాల పార్కింగ్, మీడియా గ్యాలరీ, ప్రజాప్రతినిధులు, ప్రజలు కూర్చునేందుకు అవసరమైన ఏర్పాట్లు, బస్సులు, ఇతర వాహనాల పార్కింగ్ తదితర అంశాలతో సమగ్ర నమూనా పటాన్ని సిద్ధం చేయాలని ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

ప్రతి ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక..

సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సభా వేదిక నుంచి పార్కింగ్ స్థలాల వరకు ప్రతి అంశాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని తెలిపారు.సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సమయం తక్కువగా ఉన్నందున ఎలాంటి జాప్యం లేకుండా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ పరిశీలనలో రెవెన్యూ డివిజనల్ అధికారి సదానందం, ఏసీపీ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, తహసీల్దార్ హరికిరణ్, సర్వే, పోలీస్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.