BREAKING
నేటి పంచాంగం 14 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (14 నవంబర్ 2026, శనివారం): 12 రాశుల దినఫలాలు ఇవే మాస్కోలో భారీ కారు బాంబు పేలుడు: రష్యా అనుకూల నేత సెర్గీ జవోరోట్నీకి తీవ్ర గాయాలు అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. మధుమేహ బాధితులకు నిపుణుల కీలక సూచనలు!

విమానంలో పవర్ బ్యాంక్ పేలుడు కలకలం

Select Suryaa Now
విమానంలో పవర్ బ్యాంక్ పేలుడు కలకలం

సూర్య అంతర్జాతీయ డెస్క్: డచ్ విమానయాన సంస్థ కేఎల్‌ఎం (KLM) సంస్థకు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో పవర్ బ్యాంక్ పేలి మంటలు చెలరేగిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు కారణమైన ఆ సంస్థ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) కామెయిల్ యూర్‌లింగ్స్‌పై కేఎల్‌ఎం మేనేజ్‌మెంట్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. విమాన ప్రయాణ భద్రతా నిబంధనలను ఉల్లంఘించి, గాలిలో ఉండగా పవర్ బ్యాంక్‌ను ఛార్జింగ్ పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విచారణలో తేలడంతో ఎయిర్‌లైన్స్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఆమ్నేస్టర్ డామ్ నుంచి కురాకో వెళ్తున్న కేఎల్‌ఎం విమానం (కేఎల్735) ప్రయాణిస్తున్న సమయంలో బిజినెస్ క్లాస్ క్యాబిన్‌లో ఉన్న మాజీ సీఈఓ పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో విమాన కిటికీ దెబ్బతినడంతో పాటు ఒక ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని తిరిగి బయలుదేరిన ఎయిర్‌పోర్టుకు మళ్లించాల్సి వచ్చింది. ఈ ఘటన వల్ల సుమారు 322 మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

విమానాలలో పవర్ బ్యాంక్‌లను వాడటం, ముఖ్యంగా వాటిని ఛార్జ్ చేయడంపై కఠినమైన నిషేధాలు ఉన్నప్పటికీ మాజీ సీఈఓ ఈ నిబంధనలను బేఖాతరు చేశారని అంతర్గత విచారణలో వెల్లడైంది. ప్రయాణ భద్రతకు భంగం కలిగించినందుకు గాను ఆయనపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేఎల్‌ఎం యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు అందజేసింది. మరోవైపు ఈ ఘటనపై డచ్ సేఫ్టీ బోర్డ్ (OVV) కూడా ప్రత్యేకంగా దర్యాప్తునకు ఆదేశించింది. ఈ పరిణామం అంతర్జాతీయ విమానయాన రంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది.