అధిక సాంద్రత పద్ధతితో అధిక దిగుబడి. • కోటపల్లి ఏమ్ఏఓ సాయి కృష్ణ.
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : పత్తి పంటలో అధిక సాంద్రత పద్ధతి పాటించడం వలన అధిక దిగుబడిని సాధించవచ్చునని మండల ఏమ్ఏఓ సాయి కృష్ణ అన్నారు. బుదవారం కోటపల్లి మండలంలో నూజివీడు సీడ్స్ అధిక సాంద్రత పత్తి పంట క్షేత్ర ప్రదర్శనకు హాజరై రైతులకి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏమ్ఏఓ సాయి కృష్ణ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ప్రభుత్వం రైతులకి కపాస్ క్రాంతి పథకం కింద ఉచితంగా పత్తి విత్తనాలను అందించి అధిక సాంద్రత పద్ధతి ప్రోత్సహించారు. ఈ పద్ధతిలో మొక్కల సంఖ్యని పెంచి మెపిక్వాట్ క్లోరైడ్ అనే మందుని మూడు సార్లు పిచికారి చేయడం వలన అధిక దిగుబడిని సాధించవచ్చునని వారు తెలిపారు ఈ సందర్భంగా నూజివీడు వారి అర్మిత ఎన్సీఎస్ 2778 అనే రకం ఈ పద్ధతిలో సరైన విత్తనం అని రైతులందరూ ఈ విత్తనం వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి నూజివీడు టెరీటరి మ్యాన్జేర్ రాజబాబు, మార్కెట్ డెవలప్మెంట్ ఆఫీసర్ మనోజ్ కుమార్, సర్వైపేట గ్రామ సర్పంచ్ & ఉప సర్పంచ్, మండల లీడర్స్, రైతులు పాల్గొన్నారు.