పంచాయతీ ఎన్నికల బరిలో దొమ్మేటి వినోద్ కుమార్
అంబాజీపేట మేజర్ న్యూస్ :త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల పోటీలో మాచవరం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అంబాజీపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మేటి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నట్లు విలేకరులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత సామాజిక వర్గం నుండే కాకుండా ఇతర సామాజిక వర్గాల నుండి కూడా అధిక సంఖ్యలో మద్దతుదారుల మద్దతు తనకు ఉన్నది కాబట్టి ఈ ఎన్నికలలో తప్పకుండా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సామాజిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న తాను గతంలో గ్రామంలోని అనేక సమస్యలపై పోరాటం చేసి వాటిని పరిష్కరించానని తద్వారా ప్రజల మన్ననలు పొందానని, సర్పంచ్ గా గెలిచిన తర్వాత గ్రామ ప్రజల సమస్యలను తన సొంత సమస్యలుగా భావించి బాధ్యతగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గ్రామంలోని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడమే కాకుండా చాలా సంవత్సరాలుగా అనేక ప్రాంతాలలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలను తక్షణమే బాగు చేయడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.పారిశుధ్య పనులను సకాలంలో చేయిస్తూ గ్రామాన్ని పరిశుభ్రం గా ఉంచడంతో పాటు వీధి దీపాల నిర్వహణను సక్రమంగా నిర్వర్తిస్తానని ,గ్రామం లో ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంటూ మీ కుటుంబం లోని వ్యక్తిగా ఉంటానని హామీ ఇచ్చారు.