BREAKING
ఎగ్జిక్యూటివ్ వేతనాల వెల్లడి నిబంధనలను సడలించాలని అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ప్రతిపాదన ఆర్మ్ (Arm) సీఈఓ పదవి కోసం రేనే హాస్‌ను సంప్రదించిన ఎన్విడియా తెల్ల అన్నం మంచిదా లేక బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మేలా.. అసలు నిజాలు ఇవే! డిజిటల్ కంటెంట్ బిల్లును రెండోసారి వీటో చేసిన పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రాకి పూలదండలకు బదులు పుస్తకాలు.. అభినందనల్లో వినూత్న ఒరవడి ప్రముఖ పిల్లల పుస్తకాల రచయిత, హాస్యనటుడు డేవిడ్ వాలియమ్స్‌పై దర్యాప్తునకు లండన్ పోలీసుల నిర్ణయం బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలకే భారత్ పెద్దపీట స్థానిక ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించిన డి.ఎస్.పి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్న దీప్తి శర్మ.. రెండోసారి అరుదైన ఘనత! గుజరాత్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ: సీఎం, మంత్రులతో విందు సమావేశం అస్సాం ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం కేన్సర్ మందుల ధరల నియంత్రణపై ఎన్‌పీపీఏ కఠిన నిఘా గురు అతిచారం 2026-27 | సింహరాశిలో గురు సంచార ఫలితాలు | Jupiter Transit in Leo | 12 రాశుల ఫలితాలు by Dr Edupuganti Padmaja Rani నజాఫ్‌గఢ్ రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్‌లో వైద్య సేవలను సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసుల ఫ్లాగ్ మార్చ్

గ్రామ పంచాయతీల పోరుకు మోగిన నగారా..

Select Suryaa Now
గ్రామ పంచాయతీల పోరుకు మోగిన నగారా..

 

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు

ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ వెల్లడి

ఈనెల15 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

గరుగుబిల్లి, నవంబర్ 13, మేజర్ న్యూస్:గ్రామ పంచాయతీల ఎన్నిక లకు సంబంధించి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం అధికారులు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం తొలి విడత జరగనున్న పంచా యతీల ఎన్నికలకు సంబంధించి విడు దల చేసిన నోటిఫికేషన్ వివరాలను మండల పరిషత్తు అభివృద్ధి కార్యాల యంలోని నోటీస్ బోర్డులో అతికించా రు.గరుగుబిల్లి మండలానికి సంబంధిం చి తొలి విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు ఈనెల 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం అధికారి నడిమింటి సూర్యనారాయణ పేర్కొన్నారు.తొలి దశలో ఎన్నికలు జరిగే పంచాయతీలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం శుక్రవారం అధికారికంగా విడుదల చేయడం జరిగిందన్నారు.ఈ నెల 15 వ తేదీ నుండి 17 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీక రించడం జరుగుతుందన్నారు.ఈనెల 18వ తేదీన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుందన్నారు.ఈనెల 19వ తేదీన అప్పీళ్ళు దాఖలు చేసుకో వలసి ఉందన్నారు.20 వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ,అదే విధం గా 21వ తేదీన తుది జాబితా ప్రకటిం చడం జరుగుతుందని ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ తెలిపా రు.ఈనెల 26వ తేదీన ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.
అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఫలితాలను వెలువడించడం జరుగుతుందని ఎంపీ డీవో నడిమింటి సూర్యనారాయణ వెల్లడించారు.ఈకార్యక్రమంలో మండ ల పరిషత్ అభివృద్ధి కార్యాలయ సిబ్బంది బెంకిలి శ్రీనివాసరావు,గుంట్రేడ్డి కృష్ణప్రసాద్, గంట రామినాయుడు తదితరులు పాల్గొన్నారు.