BREAKING
అంబాజీపేట మండలంలో వైభవంగా నాగుల చవితి: పుట్టల్లో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఇండియాస్ గాట్ లేటెంట్ వేదికపై టాక్సిక్ సినిమా వసూళ్లపై సమయ్ రైనా సెటైర్లు.. నటి హుమా ఖురేషి అదిరిపోయే కౌంటర్! జూలపల్లి మండలానికి 406 నూతన పింఛన్లు మంజూరు పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు కర్ర సత్య ప్రసన్నారెడ్డి"ని అభినందించిన "అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి".. మైసూరూలో దేశపు మొదటి ఎల్ఈడీ డోమ్ ప్లానెటోరియంను ప్రారంభించిన ప్రధాని మోదీ వెటర్నరీ ఫిజియాలజీలో క్విజ్ పోటీలు దుమ్ముతో ఇబ్బందులు తొలగించాలని కార్యదర్శికి వినతి. కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా 'జాతీయ గౌరవ దినోత్సవం' సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు ఆశ వర్కర్ల వినతి. బహ్రెయిన్‌లోని యూఎస్ రాడార్ వ్యవస్థపై దాడి చేశామన్న ఇరాన్ స్వచ్ఛంద ఏకగ్రీవాలతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి అటజని కంచె ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న బాల 369 టీజర్ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు పాముల పుట్టల వద్ద పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు అధ్యాపకుల కొరతను తక్షణమే పరిష్కరించాలి పెద్దూరులో ఆధ్యాత్మిక సందడి

దివ్యాంగలకు శాప్ స్పోర్ట్స్ పాలసీలో గుర్తింపు ఇవ్వాలి

Select Suryaa Now
దివ్యాంగలకు శాప్ స్పోర్ట్స్ పాలసీలో గుర్తింపు ఇవ్వాలి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులకు మరింత గుర్తింపు, ప్రోత్సాహం కల్పించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ సభ్యుడు యడ్లపల్లి సూర్యనారాయణ, సౌత్ ఇండియా కోఆర్డినేటర్ మధుసూదన్ నాయక్ కోరారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని శాప్ కార్యాలయంలో వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ భరణిను  మర్యాదపూర్వకంగా కలసి వినతి అందజేసి విజ్ఞప్తి చేశారు. సూర్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దివ్యాంగుల క్రీడలకు గుర్తింపు పెరుగుతున్న నేపథ్యంలో దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. ప్రస్తుతం శాప్ పారాఒలింపిక్స్ స్పోర్ట్స్ పాలసీలో రెండో కేటగిరీలో ఉన్న దివ్యాంగ క్రికెట్ ను మొదటి కేటగిరీలోకి చేర్చాలని కోరారు. దీనివల్ల ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయం, శిక్షణ వంటి అవకాశాలు మెరుగవుతాయని వివరించారు. దీనిపై సానుకూలమైన స్పందించిన ఆమె దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులకు 3 శాతం స్పోర్ట్స్ పాలసీ ద్వారా ప్రయోజనాలు అందేలా చైర్మన్ రవినాయుడుతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏసిఏసహకారంతో డిసిసి ఏపీ రాష్ట్రంలో ఫిజికల్ డిజెబిలిటీ క్రికెట్, బ్లైండ్ క్రికెట్, వీల్ చైర్ క్రికెట్, డెఫ్ క్రికెట్ అనే నాలుగు విభాగాల్లో దివ్యాంగ క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తోందని ప్రతినిధులు తెలిపారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్