BREAKING
అంబాజీపేట మండలంలో వైభవంగా నాగుల చవితి: పుట్టల్లో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఇండియాస్ గాట్ లేటెంట్ వేదికపై టాక్సిక్ సినిమా వసూళ్లపై సమయ్ రైనా సెటైర్లు.. నటి హుమా ఖురేషి అదిరిపోయే కౌంటర్! జూలపల్లి మండలానికి 406 నూతన పింఛన్లు మంజూరు పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు కర్ర సత్య ప్రసన్నారెడ్డి"ని అభినందించిన "అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి".. మైసూరూలో దేశపు మొదటి ఎల్ఈడీ డోమ్ ప్లానెటోరియంను ప్రారంభించిన ప్రధాని మోదీ వెటర్నరీ ఫిజియాలజీలో క్విజ్ పోటీలు దుమ్ముతో ఇబ్బందులు తొలగించాలని కార్యదర్శికి వినతి. కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా 'జాతీయ గౌరవ దినోత్సవం' సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు ఆశ వర్కర్ల వినతి. బహ్రెయిన్‌లోని యూఎస్ రాడార్ వ్యవస్థపై దాడి చేశామన్న ఇరాన్ స్వచ్ఛంద ఏకగ్రీవాలతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి అటజని కంచె ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న బాల 369 టీజర్ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు పాముల పుట్టల వద్ద పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు అధ్యాపకుల కొరతను తక్షణమే పరిష్కరించాలి పెద్దూరులో ఆధ్యాత్మిక సందడి

ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ ప్రారంభం -విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు -నాయకత్వ లక్షణాలతో పాటు మానసిక వికాసానికి దోహదం : శాప్ చైర్మన్ రవి నాయుడు

Select Suryaa Now
ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ ప్రారంభం -విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు  -నాయకత్వ లక్షణాలతో పాటు మానసిక వికాసానికి దోహదం : శాప్ చైర్మన్ రవి నాయుడు

 

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిరుపతి జోన్ స్థాయిలో నిర్వహిస్తున్న నారాయణ ప్రీమియర్ లీగ్-2026 క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి జోన్ పరిధిలోని 17 బ్రాంచీలకు చెందిన సుమారు 1,400 మంది విద్యార్థులు వివిధ క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ.. సుమారు 4,000 మంది విద్యార్థులు ఈ క్రీడా సంబరంలో భాగస్వాములయ్యారు. శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణ విద్యాసంస్థల డీజీఎం కొండల్ రావు, కోర్ డీన్ ఎ.శ్రీనివాసరావు, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, శాప్ చైర్మన్ రవి నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ఉన్నత స్థాయికి ఎదగాలని, క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, జట్టుగా పనిచేసే తత్వాన్ని అలవరుస్తాయని పేర్కొన్నారు.శాప్ చైర్మన్ రవి నాయుడు తిరుపతిలో జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహం కల్పిస్తామని తెలిపారు. డీజీఎం కొండల్ రావు ఆటలు గెలుపోటములను సమానంగా స్వీకరించే మానసిక స్థైర్యాన్ని నేర్పిస్తాయని, మానసిక వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలకు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, మానసిక వికాసాన్ని పెంపొందించడమే ఈ లీగ్ లక్ష్యమని తెలిపారు.

మూడు రోజుల క్రీడా మహోత్సవం..

నారాయణ విద్యాసంస్థలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ మూడు రోజుల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీతో పాటు ఇండోర్, అవుట్ డోర్ పోటీలు నిర్వహించనున్నారు. మూడో రోజు ముగింపు వేడుకల్లో విజేతలు, రన్నరప్ లకు బహుమతులు, ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు.ఈ కార్యక్రమంలో కడప డీజీఎం రామోహన్ రెడ్డి, కడప కోర్ డీన్ చంద్రకిషోర్, స్టేట్ కోఆర్డినేటర్ బ్రహ్మాజీ, డీన్స్, ప్రిన్సిపాల్స్, ఏజీఎంలు, కొట్టే హేమంత్ రాయల్, అకడమిక్, నాన్-అకడమిక్ సిబ్బంది పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్