BREAKING
అంబాజీపేట మండలంలో వైభవంగా నాగుల చవితి: పుట్టల్లో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఇండియాస్ గాట్ లేటెంట్ వేదికపై టాక్సిక్ సినిమా వసూళ్లపై సమయ్ రైనా సెటైర్లు.. నటి హుమా ఖురేషి అదిరిపోయే కౌంటర్! జూలపల్లి మండలానికి 406 నూతన పింఛన్లు మంజూరు పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు కర్ర సత్య ప్రసన్నారెడ్డి"ని అభినందించిన "అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి".. మైసూరూలో దేశపు మొదటి ఎల్ఈడీ డోమ్ ప్లానెటోరియంను ప్రారంభించిన ప్రధాని మోదీ వెటర్నరీ ఫిజియాలజీలో క్విజ్ పోటీలు దుమ్ముతో ఇబ్బందులు తొలగించాలని కార్యదర్శికి వినతి. కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా 'జాతీయ గౌరవ దినోత్సవం' సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు ఆశ వర్కర్ల వినతి. బహ్రెయిన్‌లోని యూఎస్ రాడార్ వ్యవస్థపై దాడి చేశామన్న ఇరాన్ స్వచ్ఛంద ఏకగ్రీవాలతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి అటజని కంచె ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న బాల 369 టీజర్ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు పాముల పుట్టల వద్ద పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు అధ్యాపకుల కొరతను తక్షణమే పరిష్కరించాలి పెద్దూరులో ఆధ్యాత్మిక సందడి

అనపర్తి మండలంలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు.

Select Suryaa Now
అనపర్తి మండలంలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు.

 11 గ్రామపంచాయతీల్లో సర్పంచ్, 140 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు. 
అనపర్తి మేజర్ న్యూస్. అనపర్తి మండల పరిధిలోని 11 గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏడు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా సహాయ ఎన్నికల అధికారి, మండల అభివృద్ధి అధికారి ఎం. రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడించారు.మండలంలోని 11 గ్రామపంచాయతీల్లో 11 సర్పంచ్ పదవులతో పాటు 140 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా మొత్తం 60,010 మంది ఓటర్ల కోసం 160 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నామినేషన్ల స్వీకరణ బాధ్యతలను స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. అనపర్తికి పప్పు శ్రీనివాసరెడ్డి, కుతుకులూరుకు టి.ఎస్. రమాదేవి, మహేంద్రవాడకు పి.వి. ప్రభాకరరావు, రామవరం, పొలమూరుకు సి.హెచ్.వి.వి. కన్నారావు, పెడపర్తి, పులుగుర్తకు సి.హెచ్. శ్రీనివాసరెడ్డి, లక్ష్మీనరసాపురం, కొప్పవరానికి టి.టి.వి. సత్యనారాయణరెడ్డి, పి.ఆర్.సి. పురం, దుప్పలపూడికి ఎస్. ముక్యాలరావు నామినేషన్ల స్వీకరణ బాధ్యతలు నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమయం కేటాయించినట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ అధికారులకు సహకరించాలని సూచించారు. మండలంలో ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎం. రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.