BREAKING
అంబాజీపేట మండలంలో వైభవంగా నాగుల చవితి: పుట్టల్లో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఇండియాస్ గాట్ లేటెంట్ వేదికపై టాక్సిక్ సినిమా వసూళ్లపై సమయ్ రైనా సెటైర్లు.. నటి హుమా ఖురేషి అదిరిపోయే కౌంటర్! జూలపల్లి మండలానికి 406 నూతన పింఛన్లు మంజూరు పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు కర్ర సత్య ప్రసన్నారెడ్డి"ని అభినందించిన "అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి".. మైసూరూలో దేశపు మొదటి ఎల్ఈడీ డోమ్ ప్లానెటోరియంను ప్రారంభించిన ప్రధాని మోదీ వెటర్నరీ ఫిజియాలజీలో క్విజ్ పోటీలు దుమ్ముతో ఇబ్బందులు తొలగించాలని కార్యదర్శికి వినతి. కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా 'జాతీయ గౌరవ దినోత్సవం' సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు ఆశ వర్కర్ల వినతి. బహ్రెయిన్‌లోని యూఎస్ రాడార్ వ్యవస్థపై దాడి చేశామన్న ఇరాన్ స్వచ్ఛంద ఏకగ్రీవాలతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి అటజని కంచె ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న బాల 369 టీజర్ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు పాముల పుట్టల వద్ద పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు అధ్యాపకుల కొరతను తక్షణమే పరిష్కరించాలి పెద్దూరులో ఆధ్యాత్మిక సందడి

రావులపాలెం మండలంలో వైఎస్సార్‌సీపీ పరిస్థితి అయోమయం! సంపాదించుకున్న నాయకులు సైడ్‌.. కార్యకర్తల్లో సందిగ్ధం!

Select Suryaa Now
రావులపాలెం మండలంలో వైఎస్సార్‌సీపీ పరిస్థితి అయోమయం!  సంపాదించుకున్న నాయకులు సైడ్‌.. కార్యకర్తల్లో సందిగ్ధం!

రావులపాలెం: మేజర్ న్యూస్ :రావులపాలెం మండలంలో వైఎస్సార్‌సీపీ రాజకీయ పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు పార్టీ కోసం పనిచేసి, తమకంటూ గుర్తింపు సంపాదించుకున్న పలువురు నాయకులు ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ సాగుతోంది.
మరోవైపు ద్వితీయ శ్రేణి నాయకత్వం, గ్రామస్థాయి కార్యకర్తలు ఉన్నప్పటికీ ఆర్థిక వనరుల కొరత పార్టీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రానున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, ఎన్నికల ఖర్చులను భరించే పరిస్థితి లేక పలువురు పోటీకి వెనుకడుగు వేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నాయకత్వం అందుబాటులో లేక, ఆర్థిక అండ లేక, క్షేత్రస్థాయిలో ముందుకు ఎలా వెళ్లాలనే విషయంలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో స్పష్టత కొరవడిందనే చర్చ వినిపిస్తోంది.అసలు పార్టీని ముందుకు నడిపించేది ఎవరు? గ్రామస్థాయిలో నాయకత్వానికి దిశానిర్దేశం చేసేది ఎవరు? ఎన్నికల వేళ అభ్యర్థులకు అండగా నిలిచేది ఎవరు? అనే ప్రశ్నలు వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తున్నాయి.
రావులపాలెం వైఎస్సార్‌సీపీలో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ఇదే.. పార్టీకి కార్యకర్తల బలం ఉన్నా, వారిని నడిపించే నాయకత్వం, ఆర్థిక భరోసా ఎక్కడ?అనేది ప్రశ్న గా మిగిలింది.