పెద్దకల్వల కాంగ్రెస్ గ్రామ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక... - అధ్యక్షుడిగా సలేంద్ర రవి
సూర్య - పెద్దపల్లి రూరల్: మండలంలోని పెద్దకల్వల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచన మేరకు గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ కమిటీ గౌరవాధ్యక్షుడిగా భూషణవేణి రాములు, అధ్యక్షుడిగా సలేంద్ర రవి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కరెంగల సాయి, ఉపాధ్యక్షుడిగా కల్వల రమేష్, ప్రధాన కార్యదర్శి గా నెత్తెట్ల శ్రీనివాస్, కార్యదర్శిగా రవి ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు పార్టీ అభివృద్ధికి, కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతన కమిటీ సభ్యులు సమష్టిగా పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలను భాగస్వాములను చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కరెంగుల రమేష్, శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ ఆర్కుటి సంతోష్, కాంగ్రెస్ నాయకులు ఓడ్నాల రమేష్, పర్స శంకరయ్య, దేవనంది సదయ్య, ఉప్పు సాగర్, ఉప్పు సతీష్, ఉప్పు శ్రీనివాస్, సమ్మయ్య , డైరెక్టర్ సదయ్య ,కార్యకర్తలు యువకులు, తదితరులు పాల్గొన్నారు.