జగదాంబ పోతురాజు నాగేంద్రుని పుట్ట వద్ద బారులు తీరిన భక్తులు..!
విశాఖపట్నం, సూర్య: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జగదాంబ వద్ద ఎల్లమ్మ గుడి పోతురాజు నాగేంద్ర స్వామి పుట్టకు భక్తులు భారీగా తరలివచ్చారు. నాగుల చవితి రోజున నాగేంద్రుని అనుగ్రహం పొంది తరించేందుకు కుటుంబాలతో సహా భక్తులు వచ్చి పోతురాజు నాగేంద్రుని పుట్ట వద్ద భక్తితో పూజలు నిర్వహించారు. నాగేంద్ర స్వామి పుట్టలో గుడ్డు, పాలు, నువ్వు పప్పు సలివిడి చెరకు, అరటిపండు జామకాయ ముక్కలో వేసి భక్తితో నాగేంద్రునికి పూజలు జరిపారు. కుటుంబ సమేతంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నుండి అతి పురాతనమైన ఎల్లమ్మ పుట్ట వద్దకు వచ్చి నాగేంద్ర స్వామికి పుట్టలో పాలు వేసి పూజలు నిర్వహించడం గత వందేలుగా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. నగరంలో అనేక చోట్ల నాగేంద్రుని పుట్టలు వెలసినప్పటికీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి పోతురాజు నాగేంద్ర స్వామి పుట్ట పుట్టకు వచ్చి క్యూ లైన్ లో నుంచని నాగేంద్రుని పుట్ట వద్ద పూజలు చెరిపేందుకు భక్తులు శుభప్రదంగా భావిస్తారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఎల్లమ్మ తల్లి పుట్ట వద్ద ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భక్తులు భారీగా తరలివచ్చి క్యూలు కట్టారు. భక్తిశ్రద్ధలతో నాగేంద్ర స్వామికి పుట్టలో పాలు వేసి పూజలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లి పుట్ట వద్ద క్యూలైన్లో అడ్డగోలుగా భక్తులు దూరి వెళ్లడంతో జూలైలో ఉన్న భక్తులు నిరుత్సాహానికి గురయ్యారు. పోతురాజు ఎల్లమ్మ తల్లి పుట్ట వద్ద క్యూలైన్లకు కంట్రోల్ చేసేందుకు పోతురాజు నాగేంద్ర పుట్టబద్ధ పుట్ట వద్ద పరివేక్షణ లేక భక్తుల ఇబ్బంది పడ్డారు. 11:30 తర్వాత ఎల్లమ్మ తల్లి పొట్ట వద్దకు పోలీసులు రావడంతో భక్తులు కాస్త ఊరట చెందారు. ప్రతి ఏడాది నాగుల చవితి రోజున పోతురాజు స్వామి పుట్టపర్తికు నగరం నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. క్యూలైన్లో నిల్చున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా పోలీస్ బందోబస్తు ముందుగా ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ అధికారులు దేవాదాయ శాఖ అధికారులు ఎల్లమ్మ తల్లి పండగ రోజు ఎలా అయితే పర్యవేక్షణ చేస్తారో అదే విధంగా నాగులచవితి రోజు కూడా దేవాదాయ శాఖ పోతురాజు నాగేంద్ర పుట్ట వద్ద ముందస్తు ఏర్పాట్లు చేసి పోలీస్ పరిరక్షణ లో భక్తులకు సేవలు అందించాలని స్థానిక ప్రాంతాల ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు.